కరోనా కట్టడిలో మాస్కులదే ప్రధానం. కొవిడ్ నేపథ్యంలో చాలామంది మాస్కులను చాలా లైట్ గా తీసుకుంటున్నారు. కొందరు మాస్కులను సరిగ్గా ధరించకపోవడం, వాడిన మాస్కులే వాడుతుండటం పాజిటివ్ కేసులకు దారి తీస్తోంది. అయితే ఉతకని మాస్కులు కూడా హానీ చేస్తాయని పలువురు డాక్టర్లు చెప్తున్నారు. శుభ్రంగా లేని మాస్కుల వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇన్ఫెక్షన్ కారకాలైన మ్యూకర్ మైసెట్స్ మాస్క్ లోకి ప్రవేశించి, ఆవాసం ఏర్పర్చుకుంటాయట. ఏరోజుకారోజు మాస్కులను శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. వెంటిలేషన్ ఇళ్లలో కూడా వాళ్లకు వైరస్, బ్లాక్ ఫంగస్ ముప్పు ఉందని కలకత్తాకు చెందిన డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి కోవిడ్ వేళ.. మాస్కులను కచ్చితంగా శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
మాస్కులు మార్చడమే బెటర్
చాలామంది రోజుల తరబడి వాడిన మాస్కులను వాడుతున్నారు. వాటిని ఉతకకుండా కొత్తవి వాడితే వైరస్ ముప్పు అసలు ఉండదు. ప్రధానంగా ఎన్ 95 సర్జికల్ మాస్కుని అస్సలు ఉతక్కూడదు. అలా ఉతకడం వల్ల అది ఎందుకూ పనికి రాకుండా పోతుంది. మాస్కుని ఉతకడానికి బదులుగా ఆరుబయట ఆరబెట్టాలి. లేదా ఎండలో డ్రై కానివ్వాలి. రెండు మూడు మాస్కులు కొనాలి. రోజుకొకటి చొప్పున వాడుకోవాలి. డబుల్ మాస్కు చాలా ముఖ్యం.











