తెలంగాణలో 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది.ఈ ఛార్జీషీట్‌లో రేవంత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొనగా వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు వేం కృష్ణకీర్తన్‌రెడ్డి,సెబాస్టియన్‌తో పాటు పలువురి పేర్లు పేర్కొంది అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేరు ప్రధాన నిందితుల జాబితాలో లేదని తెలుస్తోంది.అయితే ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ పూర్తి స్థాయిలో ఉందా లేక అదనపు ఛార్జిషీట్లు దాఖలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.కాగా రాజకీయ నాయకులపై ఉన్న కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఈ కేసుల్లో విచారణ వేగవంతమైంది.తెలంగాణలో రాజకీయ నాయకులపై క్రిమినల్,ఆర్థిక నేరాలకు సంబంధించి 143 మందిపై కేసులున్నాయి.
ఓటుకు నోటు కేసు నేపథ్యం ఇదీ..
2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డి పోటీకి సిద్దమయ్యారు.టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉంది.అప్పటికే రేవంత్‌రెడ్డి వర్సెస్ సీఎం కేసీఆర్ అనే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జరిగిన ఓ ఘటన సంచలనం రేపింది.2015 మే 31న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే,ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇస్తుండగా పట్టుకున్నామని ఏసీబీ ప్రకటించింది.వీడియోలను విడుదల చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ చేత క్రాస్ ఓటు వేయించేందుకు రూ.2కోట్లతో పాటు దేశం విడిచి వెళ్లేందుకు విమాన టిక్కెట్ ఇస్తామని ఒప్పందం జరిగిందని,అందులో భాగంగా రూ.50 లక్షలను రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్‌కి ఇవ్వబోతుండగా పట్టుకున్నామని ఏసీబీ ప్రకటించింది.రేవంత్‌రెడ్డితో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు ఉదయసింహ,జెరూసలేం మత్తయ్య,అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులపై కేసు నమోదైంది.అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది.ఈ కేసులో అరెస్టైన రేవంత్‌రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు.తరవాతి కాలంలో ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.కేసు విచారణలో ఉండగా జెరూసలేం మత్తయ్య అప్రూవర్‌గా మారిన విషయం కూడా తెలిసిందే.ఈ వ్యవహారంలో స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనని,ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని ఫోరెన్సిక్ పరిశోధనలో తేలినట్టు కూడా వార్తలు వచ్చాయి.అయితే ఫోన్‌లో చంద్రబాబు డబ్బు విషయం మాట్లాడారా లేక కేవలం మద్దతు కోరారా అనేది ఇంకా బయటకు రాలేదు.రాజకీయంగా ఆరోపణలు వచ్చాయి.తాజాగా ఛార్జి షీట్‌లో రేవంత్ రెడ్డితోపాటు వేం నరేందర్ రెడ్డి,ఆయన కుమారుడు వేం కృష్ణ కీర్తన్‌రెడ్డి,సండ్ర వెంకటవీరయ్య తదితరుల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇటు ఏసీబీ కాని,అటు ఈడీ కాని ఆడియో టేపు కాకుండా చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఏమి ఆధారాలు చూపెట్టలేకపోయాయనే వార్తలు కూడా వస్తున్నాయి.
Must Read ;- చేయి చేయి కలుపుదాం.. కరోనాను తరిమి కొడదాం : కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన రేవంత్ రెడ్డి