పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ మూవీతో పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ సాధించారు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సస్ సొంతం చేసుకున్నారు. భీమ్లా నాయక్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తూ.. సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళుతుంది.
ఇదిలా ఉంటే.. భీమ్లా నాయక్ తర్వాత పవర్ స్టార్.. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ భారీ పిరియాడిక్ మూవీ దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. పవర్ స్టార్.. ప్రభాస్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ప్రభాస్ డైరెక్టర్ ఎవరంటారా..? ప్రభాస్ తో సాహో చిత్రాన్ని తెరకెక్కించిన సుజిత్. అవును.. సుజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు పవన్ ఓకే చెప్పారని తెలిసింది. ఇది ఓ తమిళ సినిమాకి రీమేక్ అని.. ప్రస్తుతం సుజిత్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మరి… పవర్ స్టార్ ని మరింత పవర్ ఫుల్ గా సుజిత్ ఎలా చూపిస్తాడో అనేది ఆసక్తిగా మారింది.











