రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతోంది ఆర్ఆర్ఆర్. ఈ
సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ పై ఆడియన్స్ కు ఓ ఐడియా ఉంది. అదే విధంగా తారక్ పోషిస్తున్న
పాత్రపై కూడా అవగాహన ఉంది. వీళ్లిద్దరూ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో
కనిపించబోతున్నారు. అందరి దృష్టి వీళ్ల పాత్రలపైనే ఉంది. కానీ వీళ్లతో సమానంగా సీత పాత్ర
పోషిస్తున్న అలియా భట్ ఎట్రాక్ట్ చేయబోతోంది. ఆమె పాత్ర సినిమా మొత్తానికి ఓ సర్ ప్రైజింగ్ ప్యాకేజీ
అంటోంది యూనిట్.
నిజానికి రాజమౌళి సినిమాల్లో ఇలాంటి సర్ ప్రైజింగ్ ప్యాకేజీలు కొత్త కాదు. మగధీర సినిమాలో మిత్రవిందగా కాజల్ ను చూపించాడు. ఆమె కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అది. ఇక బాహుబలి ఫ్రాంచైజీలో దేవసేన, శివగామి క్యారెక్టర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరో తర్వాత హీరో అన్నట్టు ఉంటాయి ఆ పాత్రలు. సో.. రాజమౌళి సినిమాల్లో ఫిమేల్ ఓరియంటెండ్ పాత్రల్ని తక్కువ చేసి చూడలేం. రౌద్రం-రణం-రుధిరం (ఆర్ఆర్ఆర్)లో కూడా అలియాభట్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోంది.
సినిమాలో అలియాభట్ పాత్రకు సంబంధించిన షేడ్స్ ను రాజమౌళి తండ్రి, ఆర్ఆర్ఆర్ కథా రచయిత విజయేంద్రప్రసాద్ కొద్దిగా బయటపెట్టాడు. సినిమాలో సీత పాత్రలో అలియాభట్ కొద్దిసేపు మాత్రమే కనిపిస్తుందట. కానీ సినిమా మొత్తం ఆమె ప్రభావం ఉంటుందట. ఆమె కనిపించకపోయినా, సీత పాత్ర సినిమా అంతా ఉన్నట్టు మనకు అనిపిస్తుందట. ఆ క్యారెక్టర్ లో అంత మేజిక్, అంత డెప్త్ ఉందంటున్నారు విజయేంద్రప్రసాద్.
ఇక ఈమధ్య ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన రాజమౌళి కూడా ఇదే విషయాన్ని బయటపెట్టాడు. సినిమాలో అలియాభట్ ను ఎందుకు తీసుకున్నామో చెప్పాడు. ఆర్ఆర్ఆర్ కు పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావాలనో లేక తప్పనిసరిగా బాలీవుడ్ హీరోయిన్ ఉండాలనే ఉద్దేశంతోనో అలియాను తీసుకోలేదన్నాడు. ఆ పాత్రకు అలియాభట్ సరిపోతుంది కాబట్టి తీసుకున్నామని, సీత క్యారెక్టర్ కు ఆమె వందశాతం న్యాయం చేస్తోందని చెప్పుకొచ్చాడు.
ఇక అలియా భట్ విషయానికొస్తే.. రీసెంట్ గా కరోనా బారిన పడింది ఈ చిన్నది. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. త్వరలోనే సెట్స్ పైకి కూడా రాబోతోంది. ముంబయిలో ఈనెల 25 నుంచి షూటింగ్స్ కు అనుమతి ఇచ్చారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో చేస్తున్న ఓ సినిమాకు సంబంధించి ఒక రోజు షూట్ పెండింగ్ ఉంది. దాన్ని ముందుగా పూర్తిచేయబోతోంది అలియా భట్. ఆ తర్వాత నేరుగా వచ్చి ఆర్ఆర్ఆర్ సెట్స్ లో జాయిన్ అవుతుంది. అయితే కేసీఆర్ సర్కార్ నుంచి షూటింగ్స్ కు ఇంకా పర్మిషన్లు రాలేదు. అనుమతులు వచ్చిన వెంటనే మరోసారి అలియాభట్-చరణ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు రాజమౌళి.
Must Read ;- రాజమౌళి జేమ్స్ బాండ్ ను త్రివిక్రమ్ లాక్కున్నాడా?