దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమా అత్యంత భారీ బట్జెట్ తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమ్రం భీమ్ గా యన్టీఆర్ నటిస్తోన్న ఈ పీరియాడికల్ ఫిక్షనల్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే తారక్, చెర్రీల టీజర్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో మరో ముఖ్యపాత్రలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్ నటిస్తున్నారు.
ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి లో సీత గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఇందులో ఆమె కు సంబంధించిన లుక్ ఈ రోజే విడుదలైంది. అల్లూరి రామరాజు ప్రేమించిన అమ్మాయి సీతగా ఆలియా నటిస్తోంది. ముందుగా రాముని విగ్రహం ముందు సిలౌట్ లో రివీలైన ఆలియా లుక్ పై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు పూర్తిగా రివీలైన ఆలియా లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇందులో ఆలియా చాలా అందంగా కనిపిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ .. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- ‘ఆర్ఆర్ఆర్’ లో ఆలియా పాట పాడబోతుందా?