దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలకి ఆస్థాన రచయిత ఎవరో అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి అజేయ దర్శకుడిగా నిలవడానికి మూలకారకుడు ఆయనే. ముఖ్యంగా జక్కన్న ప్రతీ సినిమాలోనూ.. ఎమోషన్స్ హై రేంజ్ లో ఉండడానికి విజయేంద్ర ప్రసాద్ రాసిన స్ర్కిప్టే అని చెప్పకతప్పదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనదగ్గ చిత్రం బాహుబలి.
ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ .. రామ్ చరణ్, యన్టీఆర్ క్రేజీ మల్టీస్టార్ ‘ఆర్.ఆర్.ఆర్’ కి కథ అందించారు. ఇక ఈ సినిమా ఆయన బాలీవుడ్ లో ఒక బహుభాషా చిత్రానికి స్ర్కిప్ట్ సమకూర్చుతున్నారు. సినిమా పేరు సీత.. ది ఇంకర్నేషన్ . తాజాగా విడుదలైన ఈ పోస్టర్ సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. హ్యూమన్ బీయింగ్ స్డూడియోస్ సంస్థ ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించింది.
అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో, మనోజ్ ముంతాషీర్ మాటలు రాస్తున్న సీత చిత్రం .. పాన్ ఇండియా కేటగిరిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం విడుదల కాబోతోంది. ఈ సినిమా ముఖ్యంగా సీతాదేవి గురించి ఎవరికీ తెలియని విషయాల్ని చెబుతుంది. దీనికోసం పెద్ద ఎత్తున విఎఫ్ ఎక్స్ చేయడానికి ఓ ప్రముఖ సంస్థ రంగంలోకి దిగుతోంది. ఈ సినిమాకి కేస్టింగ్ , టెక్నికల్ టీమ్ ఇంకా సెట్ అవలేదు. మరి ఈ సినిమా విజయేంద్రప్రసాద్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- యాక్షన్ సీన్స్ లో నిమగ్నమైన ఆర్ ఆర్ ఆర్ టీమ్