ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి ఈ నెల 15వ తేదీ ఓ అప్ డేట్ రాబోతోంది. అదేమిటంటే ఈ సినిమాలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రను ధరించింది. అల్లూరి సీతారామ రాజు పాత్రధారి రామ్ చరణ్ కు జోడీగా ఇందులో ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామ రాజు బయోపిక్ లో అల్లూరి సీతారామరాజుగా కృష్ణ నటిస్తే సీత పాత్రను విజయనిర్మల పోషించింది.
ఆ సీత గానే ఆలియా ఇందులో నటిస్తోంది. సీతారామరాజు మరదలి పాత్ర ఇది. ఆమె లుక్ ఎలా ఉండబోతుందన్నది సోమవారం చూడాల్సిందే. 15వ తేదీ 11 గంటలకు ఈ లుక్ ను విడుదల చేస్తారు. ఈ లుక్ ను ఆరోజే విడుదల చేయడానికి కారణం ఉంది. ఆరోజు ఆలియా భట్ పుట్టిన రోజు. అందుకే రాజమౌళి ఈ అప్ డేట్ ఇస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబరు 13న విడుదల కాబోతోంది. అప్పటిదాకా ఏదో ఒక అప్ డేట్ ఈ చిత్ర యూనిట్ నుంచి రాబోతోంది.
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఏడాది విడుదలయ్యే భారీ బడ్జెట్ చిత్రాల్లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఎందుకంటే బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ప్రాజెక్టు కావడమే అందుకు కారణం. ప్రతి నెలా ఏదో ఒక అప్ డేట్ ఉండేలా చిత్ర యూనిట్ జాగ్రత్త పడుతోంది.
Must Read ;- 1920 కాలంలోకి రామ్ చరణ్, ఆలియాభట్ రొమాంటిక్ జెర్నీ











