యన్టీఆర్ 30ని తెరకెక్కించాల్సిన త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ఇప్పుడు మహేశ్ బాబు తో తన తదుపరి సినిమాను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్ పై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన మేకర్స్ .. సినిమా రిలీజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.
మహేశ్ బాబు 28వ సినిమాగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా.. షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మూడో సినిమా ఎప్పుడో రావాల్సింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈ కాంబో మూవీపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా లోని మహేశ్ బాబు పాత్రపై అప్పుడే కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో మహేశ్ బాబు జేమ్స్ బాండ్ తరహాలోని సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడట. అంతేకాదు.. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయట.
నిజానికి దర్శకధీరుడు రాజమౌళి.. తను మహేశ్ బాబు తో సినిమా తీస్తే .. జేమ్స్ బాండ్ తరహాలో ఆయన్ని చూపిస్తానని ఒకసారి ఎప్పుడో చెప్పాడు. అయితే ఆతర్వాత జక్కన్న మహేశ్ బాబుతో తాను తదుపరి చిత్రాన్ని తీస్తున్నానని ప్రకటించినప్పుడు.. మాత్రం జేమ్స్ బాండ్ ప్రస్తావన మళ్ళీ రాలేదు. ఇప్పుడు రాజమౌళి ప్లాన్ మారినట్టుంది. ఏదేతైనేం.. రాజమౌళి తీస్తానన్న జేమ్స్ బాండ్ సినిమాను ఇప్పుడు త్రివిక్రమ్ చేస్తూండడం అభిమానులకు భలేగా ఆనందానిస్తోంది. మరి ఈ నిజంగానే త్రివిక్రమ్.. మహేశ్ బాబు తో చేసేది జేమ్స్ బాండ్ చిత్రమో కాదో చూడాలి..
Must Read ;- పెర్సనల్ స్టైలిస్ట్ కి కరోనా పాజిటివ్ .. స్వీయ నిర్బంధంలో మహేశ్ బాబు ఫ్యామిలీ