కరోనా మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈక్రమంలో దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్ తగు జాగ్రత్తలు తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే టీకా తీసుకున్న వారికి సైతం కరోనా వచ్చే ప్రమాదముందని చెప్పారు. కోఠిలోని ఆ శాఖ కార్యాలయంలో డీఎంహెచ్ వో రమేశ్ రెడ్డితో కలిసి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
12 లక్షల మందికి టీకా…
తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకూ 24,49,330 డోసులు వచ్చాయని శ్రీనివాస్ వెల్లడించారు. అందులో 12 లక్షల మందికి టీకాలు ఇచ్చినట్టు తెలిపారు. 0.7 శాతం డోసులు మాత్రమే వృథా అయ్యాయని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ తప్పని సరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రెండురోజుల్లో హోలీ, ఆ తర్వాత ఈస్టర్, ఉగాది పండుగలు ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Must Read ;- హైదరాబాద్ నుంచి మరో కరోనా వ్యాక్సిన్