మాంచి ఊపు మీదున్నాం. ఏ ఎలక్షన్ అయినా సరే.. సెలెక్షన్ ఎట్లున్నా సరే.. గెలుపు వచ్చి ఒడిలో వాలిపోతోంది అట్లా. వలంటీర్ల సైన్యం ఆ ఓట్లకు ఎప్పుడూ పహారా కాస్తూనే ఉంటుంది.. తమ దగ్గరున్న సంక్షేమ ఆయుధాలతో. పిచ్చ పిచ్చగా సంపాదించేస్తున్న లోకల్ పార్టీ నేతలు,… ఎటూ బీభత్సంగా ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. అయినా ఎక్కడో ఓ మూల అనుమానం.. పొరపాటున గెలుపు స్లిప్ అయిందా.. శత్రువు ఇక అలుపు లేకుండా అటాక్ చేస్తాడు.. అందుకే అన్నీ ఆచి తూచి డిసైడ్ చేయాలనే దిశగా జగన్ ఆలోచనలు కొనసాగుతున్నాయి.
స్థానిక ఎన్నికల్లో..
స్థానిక ఎన్నికల్లో నానా రచ్చ జరిగినా.. అంతిమంగా ఘనవిజయం సొంతం అనిపించుకున్నారు. ఇక త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికపైనా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు వారి టార్గెట్ గెలుపు కూడా.. ఆ గెలుపు 4 లక్షల మెజారిటీతో గెలవాలని. అంతేకదా మార్కెటింగ్ కరెక్టుగా ఉంటే.. సినిమా బాగోపోయినా.. కలెక్షన్లు అదిరిపోతాయి.. అదే సూపర్ హిట్ అని చెప్పేసుకుంటారు. ఇప్పుడు ఎన్నికలు కూడా అలాగే అయిపోయాయనిపిస్తోంది. అయితే తిరుపతి ఉప ఎన్నికలో అనుకున్నట్లు గ్రాండ్‌గా గెలిస్తే …తర్వాత మరో గ్రాండ్ ప్లాన్ వైసీపీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసినా..
అదేంటంటే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ కొట్టి.. ఇంకా అధికారికంగా జెండా పట్టుకోని ఎమ్మెల్యేలు కొందరున్నారు. వారితో రాజీనామాలు చేయించి .. ఎన్నికలు పెట్టించి.. అవి కూడా వైసీపీ ఖాతా అని స్టాంప్ వేసేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఈ లిస్టులో ఉన్నారు. కాని ఒక్కరు కూడా గ్యారంటీగా గెలుస్తారనే పరిస్ధితి లేదు. అదొక్కటే జగన్‌ని టెన్షన్ పెడుతున్న పాయింట్.
వైసీపీ వేవ్‌ను ఎదుర్కొని..
వైసీపీ వేవ్‌ను ఎదుర్కొని టీడీపీ గెలిచిన నియోజకవర్గాలివి. ఇందులో పర్సనల్ ఎఫెక్ట్ చూపించింది కేవలం వంశీ మరియు బలరామ్ మాత్రమే. ఇప్పుడు వారికి కూడా పరిస్ధితులు అనుకూలంగా లేవు. గన్నవరంలో టీడీపీ వాళ్లు ఎటూ వ్యతిరేకమే.. కాని వైసీపీలో ఉన్న మరో రెండు వర్గాలు కూడా వ్యతిరేకమే. ఎన్ని చెప్పినా .. వీరంతా వ్యతిరేకంగానే పని చేస్తారు..అందులో వేరే ముచ్చటయితే లేదు. అందుకే వంశీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నా.. జగన్‌కే కాన్ఫిడెన్స్ రావటం లేదు. ఇక చీరాల సంగతి సరేసరి. ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ పక్కలో బల్లెంలా ఉన్నాడు. ఆమంచి గట్టిగా అనుకుని పని చేస్తే.. బలరామ్ గెలవడం కష్టం. అందుకే ఇక్కడ కూడా టెన్షనే. ఇక గుంటూరు వెస్ట్‌లో మాత్రం మద్దాలి గిరికి ఇలాంటి సమస్యలు పెద్దగా లేవు. పైగా స్థానిక ఎన్నికల్లో ఇక్కడ స్వీప్ చేశారు. వాసుపల్లి గణేష్‌కి మాత్రం స్టీల్ ప్లాంట్ గండం పొంచి ఉంది. రాజధాని ముచ్చట కలిసొస్తుందనే అనుకున్నా.. స్టీల్ ప్లాంట్ మాత్రం డ్యామేజ్ చేసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆ ఎఫెక్ట్ కనిపించింది. లేదంటే అక్కడ కూడా స్వీప్ చేసేవాళ్లు. సో ఇప్పుడు అక్కడ కూడా టెన్షనే.
అయినా సరే.. ఇన్ని సమస్యలున్నా సరే.. తమ మార్కు ఓట్ల మార్కెటింగ్ పర్ఫెక్టుగా పని చేస్తే చాలు.. గెలుపు మనదే అనుకుంటున్నారు వైసీపీ నేతలు. ఏమైనా తిరుపతి తర్వాత.. ఈ నాలుగు నియోజకవర్గాల ఉప ఎన్నికలతో ఏపీ రాజకీయం మరింత హీటెక్కడం ఖాయం.
Must Read ;- వైసీపీది మనీ ఫ్లస్ పవర్.. తిరుపతిలో టీడీపీకి అగ్నిపరీక్ష