దళపతి విజయ్ కూడా జనం ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత ఏడాది సంక్రాంతికి మాస్టర్ గా జనం ముందుకు వచ్చిన దళపతి ఇప్పుడు ‘బీస్ట్’ చిత్రంతో రాబోతున్నాడు. ఇది యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. మృగం లాంటి పాత్ర ఇది. ఈ ఏడాది ఏప్రిల్ 14న థియేటర్లలోనే విడుదలవుతుంది. సన్ పిక్చర్స్ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ప్రకటన 2020 డిసెంబరులో వస్తే సెట్స్ పైకి గత ఏడాది మార్చిలో వెళ్లింది.
కోవిడ్ కారణంగా షూటింగ్ కు అంతరాయం కలిగింది. ఎట్టకేలకు చిత్రీకరణను పూర్తి చేశారు. చెన్నైతో పాటు ఢిల్లీ, జార్జియాలలో చిత్రీకరణ చేశారు. మొదట్లో ఏఆర్ మురుగదాస్ ను దీనికి దర్శకుడిగా ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల అతను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో నెల్సన్ దిలీప్ కుమార్ ఆ బాధ్యతలు చేపట్టారు. పాత స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసి ఎట్టకేలకు పూర్తి చేశారు.
అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందించారు. విజయ్ పక్కన పూజా హెగ్డే నటించింది. సెల్వరాఘవన్, యోగిబాబు, ఫైన్ టామ్ చాకో, జాన్ విజయ్, షాజీ చెన్, అంకుర్ అజిత్ వికల్ తదితరులు నటించారు. కళానిధి మారన్ దీనికి నిర్మాత. ఏప్రిల్ లో విడుదల కాబోయే భారీ చిత్రాల సరసన ఈ సినిమా కూడా ఉంది.











