November 9, 2026 5:15 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఉద్య‌మం @ 600.. ల‌క్ష్యం సిద్ధించాల్సిందే

ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొనసాగించాల‌ని డిమాండ్ చేస్తూ అమరావ‌తి రైతులు చేస్తున్న ఉద్య‌మం ఆదివారానికి 600 రోజుల‌కు చేరింది. ఎన్ని రోజులైనా త‌మ ల‌క్ష్యం సిద్ధించేదాకా ఉద్య‌మాన్ని ఆపేది లేద‌ని ఈ సంద‌ర్భంగా రైతులు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు అలుపెర‌గ‌ని ఈ పోరుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు.

August 8, 2021 at 11:36 AM
in Andhra Pradesh, Latest News, Politics
Amaravathi Farmers Movement
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Amaravathi Farmers Movement Reached 600 Days : 

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌రిర‌క్షించుకునేందుకు అలుపెర‌గ‌ని పోరాటం సాగుతోంది. ఆదివారం నాటికి ఈ ఉద్యమం 600 రోజుల‌కు చేరుకుంది. అయినా గానీ త‌మ డిమాండ్ మేర‌కు రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగిస్తామ‌ని జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌క‌టించేదాకా త‌మ ఉద్య‌మాన్ని ఆపేది లేద‌ని ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి రైతులు విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్య‌మం 60 రోజుల‌కు చేరుకున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆదివారం రైతులు త‌ల‌పెట్టిన ర్యాలీలు, నిర‌స‌న‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కారు అనుమ‌తి నిరాక‌రించింది. అయితే పోలీసు ఆంక్ష‌ల‌ను తెంచుకుని అయినా నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తామ‌ని రైతులు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో రైతుల‌ను నిర‌స‌న‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించేలా జ‌గ‌న్ స‌ర్కారు రాజ‌ధాని ప‌రిధిలోని గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. ఫ‌లితంగా ఆయా గ్రామాల్లో ఆదివారం ఉద‌యం నుంచే ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

న‌మ్మించి మోసం చేసిన జ‌గ‌న్‌

చంద్ర‌బాబు హ‌యాంలోనే అమ‌రావతిని రాజ‌ధానిగా ఎంపిక చేసినా.. తాను అధికారంలోకి వ‌చ్చినా రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగిస్తాన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ చెప్పారు. అంతేకాకుండా ఆ మాట నిజ‌మేనని న‌మ్మించేలా తాడేప‌ల్లిలో రాజ‌భ‌వ‌నం లాంటి ఇంటిని కూడా ఆయ‌న నిర్మించుకున్నారు. ఇవ‌న్నీ చూసిన‌నం అయ‌న మాట నిజమేన‌ని న‌మ్మి వైసీపీకి ఓట్లేశారు. అయితే ఎప్పుడైతే అధికారంలోకి వ‌చ్చారో అప్పుడే జ‌గ‌న్ త‌న నిజస్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం మొద‌లెట్టారు. అమరావతి ప‌రిధిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. దానిపై ద‌ర్యాప్తు చేస్తామ‌ని, రాజ‌ధాని ప‌రిధిలో చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం త‌ప్పించి వేరే ఎవ్వ‌రూ లేర‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా అమరావ‌తిపై త‌న‌దైన శైలి క‌క్ష‌ను పెంచుకున్న జ‌గ‌న్‌.. అమరావ‌తిని పురిట్లోనే చంపేసే దిశ‌గా సాగారు. ఇందులో భాగంగానే మూడు రాజ‌ధానుల మాట ఎత్తుకున్న జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా కొన‌సాగిస్తూ.. ప‌రిపాల‌నా రాజ‌ధానిని విశాఖ‌లో, న్యాయ రాజ‌ధానిని క‌ర్నూలులో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అందుక‌నుగుణంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. మొత్తంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు మ‌రీ ముఖ్యంగా రాజ‌ధాని కోసం వేలాది ఎక‌రాల భూముల‌ను ఇచ్చిన అమ‌రావ‌తి రైతుల‌ను జ‌గ‌న్ న‌మ్మించి న‌ట్టేట ముంచార‌నే చెప్పాలి.

చంద్ర‌బాబు పిలుపే ఆల‌స్యం

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌కు స‌మ‌దూరంలో ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తి ప‌రిధిలో ఏర్పాటు చేయాల‌ని నాటి ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నిర్ణ‌యించారు. అయితే ఆ ప్రాంతంలో ప్ర‌భుత్వ భూములేవీ లేని కార‌ణంగా రైతుల నుంచి భూముల‌ను సేక‌రించాల‌ని భావించారు. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్ పేరిట కొత్త త‌ర‌హా భూ సేక‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. దీనికి రైతుల నుంచి భారీ స్పంద‌న వ‌చ్చింది. సింగిల్ పైసా ఖ‌ర్చు లేకుండా ప్ర‌భుత్వం ఏకంగా 32 వేల ఎక‌రాల‌ను సేకరించింది. అదే స‌మ‌యంలో రైతుల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేక‌త లేకుండానే.. త‌మ ప్రాంతంలో రాజ‌ధాని వ‌స్తే.. త‌మ బ‌తుకులు మారిపోతాయ‌ని భావించి భూములు ఇచ్చారు. ఈ భూసేక‌ర‌ణ ఓ య‌జ్జంలా జ‌ర‌గ్గా.. సింగిల్ పైసా ఖ‌ర్చు లేకుండా వేలాది ఎక‌రాల సేక‌ర‌ణ‌పై ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర ప్ర‌భుత్వం స‌హా ప‌లు ఇత‌ర దేశాలు కూడా చంద్ర‌బాబు స‌ర్కారు, రైతుల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాయి. భూసేక‌ర‌ణ పూర్తి కాగానే.. తొలుత స‌చివాల‌యం నిర్మాణం చేప‌ట్టిన చంద్ర‌బాబు స‌ర్కారు.. ఆ త‌ర్వాత అసెంబ్లీని, త‌ద‌నంత‌రం రాష్ట్ర హైకోర్టును.. వాటికి స‌మాంత‌రంగా ఉద్యోగులు, అధికారుల‌కు ఇళ్లు తదిత‌రాల నిర్మాణాల‌ను కూడా చేప‌ట్టింది. మొత్తంగా అప్ప‌టిదాకా సాగు భూములుగా ఉన్న అమ‌రావ‌తి రోజుల వ్య‌వ‌ధిలోనే రాజ‌ధాని రూపును సంత‌రించుకుంది.

జ‌గ‌న్ రాగానే.. నిలిచిన అభివృద్ధి

అయితే ఎప్పుడైతే జ‌గ‌న్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారో.. ఆ మ‌రుక్ష‌ణ‌మే రాజ‌ధానిలో అభివృద్ధి ప‌నుల‌న్నీ నిలిచిపోయాయి. అప్ప‌టికే రాజ‌ధానిలో పెట్టిన వేలాది కోట్ల రూపాయ‌లు బూడిద‌లో పోసిన ప‌న్నీరే అయ్యింద‌న్న వాద‌న‌లు వినిపించాయి. బంగారం పండే త‌మ భూముల‌ను రాజ‌ధాని కోస‌మంటూ ఇస్తే.. ఇప్పుడు వాటిని బీడు భూములుగా మార్చ‌డంతో పాటు త‌మ జీవ‌నోపాధిని దెబ్బ కొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ స‌ర్కారు తీరును నిర‌సిస్తూ అమ‌రావ‌తి రైతులు ఉద్య‌మాన్ని ప్రారంభించారు. రాజ‌ధాని ప‌రిధిలోని 29 గ్రామాల్లో ఎక్క‌డిక‌క్క‌డ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని క‌రోనాను కూడా లెక్క చేయ‌కుండా నిర‌స‌న‌లు కొన‌సాగించారు. అయితే ఈ దీక్ష‌ల‌ను కూడా భ‌గ్నం చేసే దిశ‌గా క‌దిలిన జ‌గ‌న్ స‌ర్కారు.. కొంద‌రు పెయిడ్ ఆర్టిస్టుల‌ను రంగంలోకి దించి పోటీ ఉద్య‌మాల‌ను కూడా చేయించింది. అయితే ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌ని అమ‌రావ‌తి రైతులు.. పోలీసుల నుంచి ఆంక్ష‌లు క‌ఠిన‌తర‌మ‌వుతున్నా కూడా వెన‌క్కు త‌గ్గ‌కుండా ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తున్నారు. ఆ ఉద్య‌మం ఆదివారం నాటికి 600 రోజుల‌కు చేరింది.

లోకేశ్ సంపూర్ణ మ‌ద్ద‌తు

అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మం 600 రోజుల‌కు చేరుకున్న సంద‌ర్భంగా వారికి మ‌ద్ద‌తు తెలుపుతూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ రైతుల‌కు త‌న సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ‘‘అమరావతిని అంతం చేసేందుకు వైకాపా నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకూ చేసిన కుట్రలన్నింటిని రైతులు ఓర్పుతో ఛేదించారు. బెదిరింపులు,అణిచివేత, అరెస్టులకు అదరం..బెదరం అంటూ 600 రోజులుగా జై అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యమైన రైతులు, మహిళలు, యువత కు ఉద్యమాభివందనాలు. రోడ్లను సైతం తవ్వేస్తూ అమరావతిని చంపేస్తాం అని ఆనందపడుతున్న జ‌గ‌న్ గారూ!.. మీరు తవ్వుకున్న ఆ గుంతల్లోనే వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చిపెట్టబోతున్నారు. అవమానాల్ని భరిస్తూనే రాజధాని అమరావతి గొప్పతనాన్ని దేశమంతా తెలిసేలా చేసిన రైతులనే అంతిమ విజయం వరించబోతుంది’’ అని లోకేశ్ పేర్కొన్నారు.

Amaravathi Farmers Movement Reached 600 Days

జ‌గ‌న్ తీరుపై చంద్రబాబు మండిపాటు

అమరావతి ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భఁగా టీడీపీ అధినేత చంద్రబాబు.. జ‌గ‌న్ తీరును నిర‌సిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమం చారిత్రాత్మకం అని ఆయన అన్నారు. జగన్ చేస్తున్న దాడి అమరావతిపై కాదని, యావత్ రాష్ట్ర సంపద సృష్టిపైనే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఉద్యమాన్ని అణచాలని చూసినా మొక్కవోని దీక్షతో రైతులు చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కన్నతల్లి లాంటి 32 వేల ఎకరాల భూమిని రైతులు, రైతు కూలీలు త్యాగం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. వారు ఇచ్చిన భూమిలోనే హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగులకు ఇళ్లు కట్టించామన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, నేల పటుత్వం లేదని, ముంపు ప్రాంతమని, అన్ని వర్గాల ప్రజలుంటే కేవలం ఒకే సామాజిక వర్గమే ఉందంటూ వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా వైసీపీ తప్పుడు ప్రచారాలు ఆగలేదన్నారు. రాజధానిలో రోడ్లు వేసిన కంకరను దొంగతనంగా తవ్వుకుని, హైకోర్టు సమీపంలో ఇసుకను మాయం చేసే స్ధితికి వైసీపీ నేతలు వచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్మృతి వనాన్ని సైతం చెడగొట్టారన్నారు.

Tags: #TheLeoNewsAmaravathi Farmers Movement Reached 600 Days Amaravathi Farmers MovementAmaravathi Farmers protestamaravathi movementamaravathi@600amaravati farmersamaravati farmers protest how many daysamaravati farmers protest todayamaravati newsamaravati smart cityamravati smart city projectandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsap with amaravatiLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleotopnara chandrababunaidunara lokeshtelugu newsthe new capital of andhra pradesh will bewhy amaravati farmers are protesting quorays jaganmohan reddy
Previous Post

థర్డ్ వేవ్ ముంచుకొస్తోంది. మరింత జాగ్రత్త తప్పదు

Next Post

నార్త్ గేటు.. ఇక‌నైనా కేసీఆర్ వ‌స్తారా?

Related Posts

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

నువ్వు లక్ష ఇచ్చిన వైసీపీకి ఓటు వేయము | AP Women Shocking Comments On YS Jagan | AP News | Leo News

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist