కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్ననం కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు, దేవ దేవుడికి సంబంధించిన ఇతరత్రా వ్యవహారాల పర్యవేక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటైంది. పవిత్ర కార్యాన్ని లాభాపేక్ష, బంధుప్రీతి లేకుండా బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఈ బోర్డు… వైసీపీ జామానాలో దారి తప్పింది. ఆశ్రిత పక్షపాతానికి పాల్పడింది. ఇతర సాామాజిక వర్గాలను అల్లంత దూరాన పెట్టేసి… తన సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేసింది. దేవదేవుడి పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. అత్యంత జాగ్రత్తతో వెంకన్న నిధులను ఖర్చు పెట్టాల్సిన గురుతర బాథ్యతను గాలికి వదిలేసి… నిధులను దుర్వినియోగం చేసింది.
ఈ వ్యవహారంలో దోషులుగా అడ్డంగాదొరికిపోయిన వారిని నిబంధనలకు విరుద్ధగా వెనకేసుకువచ్చింది. అంటే… తిరుమల వెంకన్న నిధులను పక్కదారి పట్టించిన వారికి మద్దతు పలికి మహా పాతకానికి పాల్పడిందన్న మాట. ఇక స్వామి వారి దర్శనాల్లో సింహభాగం తమ సామాజిక వర్గానికి చెందిన వారికే కట్టబెట్టిన వైైసీపీ పాలకులు… భగవంతుడి వద్ద కూడా క్షమించరాని నేరానికి పాల్పడ్డారు.
ఇవేవో వైసీపీ అంటే గిట్టని వారో… లేదంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కారులోని పెద్దలో చేస్తున్న ఆరోపణలు అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే… ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా విచారించి… ఆయా అంశాలప లోతైన దర్యాప్తు చేసిన తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ వాఖ తేల్చిన పచ్చి నిజాలు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నాటి సీఎం వైైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఏకంగా నాలుగేళ్ల పాటు టీటీడీకి చైర్మన్ గా వ్యవహరించారు. చివరి ఏడాది కాలం పాటు జగన్ అనుంగుడు, తిరుపతి ఎమ్మెల్యేగా కొనసాగిన భూమన కరుణాకరరెడ్డి ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ఇద్దరి హయాంలో టీటీడీలో దుర్మార్గాలు రాజ్యమేలాయి.
వైవీ సుబ్బారెడ్డి పాలనలో వెంకన్న దర్శనాలకు సంబంధించి భారీ ఎత్తున అక్రమాలు జరిగితే… భూమన హయాంలో టీటీడీ నిధులు భారీ ఎత్తున దుర్వినియోగం అయ్యాయి. వీటిని అరికట్టాల్సిన నాటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ… అక్రమాలకు వత్తాసు పలికారట. ఈ మేరకు విజిలెన్స్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరిపోయినట్లు సమాచారం. అదే సమయంలో ఈ నివేదికను పరిశీలించి…టీటీడీలో అక్రమాలకు పాల్పడ్డ వారిపై తగిన రీతిలో చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ జమానాలో తొలుత నగరి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రి హోదాలో ఆర్కే రోజా ఎప్పుడు పడితే అప్పుడు స్వామి వారిని దర్శించుకునేా వారు. స్వామి వారి దర్శనానికి వెళ్లిన ప్రతిసారి… ఆమె తన వెంట ఓ 50 మందిని వెంటేసుకుని వెళ్లేవారు. ఒకసారి ఆమె వెంట ఆలయంలోకి వెళ్లిన వారు మరోమారు కనిపించేవారు కాదు. అంటే… వెంకన్న వద్దకు వెళ్లిన ప్రతి సారి రోజా ఓ కొత్త బ్యాచ్ ను తీసుకెళ్లేవారు. ఇలా స్వామి వారి దర్శనాన్ని ప్రత్యేకంగా ఇప్పించిన కారణంగా ఆయా బ్యాచ్ ల నుంచి రోజా భారీ ఎత్తున దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఏ ఇతర మంత్రికి గానీ, ఎమ్మెల్యేకు గానీ దక్కనన్ని ప్రత్యేక దర్శన టికెట్లు రోజాకు మాత్రమే దక్కడ నిజంగానే ఆశ్చర్చమే.
ఇక జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలగిన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి కూడా టీటీడీ దర్శనాల్లో అగ్ర తాంబూలమే దక్కిందట. అంటే… సుబ్బారెడ్డి జమానాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఎలా కాాలనుకుంటే… అలా శ్రీవారిని వినియోగించుకున్నారన్న మాట. ఇక టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు సంస్థలకు అధిపతులుగా రెడ్డి సాామాజిక వర్గానికి చెందిన వారే నియమితులు అయ్యారు. ఈ నియామకాల్లో అర్హతలు లేకున్నా కూడా కొందరు రెడ్లకు ఈ పదవులు కట్టబెట్టినట్లు తేలింది.
ఇక భూమన హయాంలో అయితే… తిరుపతి వేదికగా ఉన్న ఆలయాల్లో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగంతో పాటుగా నిధుల దుర్వినియోగం కూడా జరిగింది. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి, శ్రీకోదండరాస్వామి ఆలయాలకు చెందిన సత్రాలను కూల్చివేశారు. ఇంజినీరింగ్ నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఈ సత్రాలను కూల్చేాశారు. ఫలితంగా భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉన్న వసతి సౌకర్యాలు అందుబాటులో లేకుండాపోయాయి. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో ఇతరత్రా నిర్మాణాలు ఏర్పాటు చేసినా…గతంలో మాదిరిగా భక్తులకు వెసులుబాటు లభించడం లేదు. ఈ వ్యవహారంలో టీటీడీకి రూ.600 కోట్ల మేర ఖర్చు కాగా… ఆ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయాయి. భక్తుల నుంచి శ్రీవారి పరకామణికి వచ్చిన డాలర్లను తస్కరించిన ఉద్యోగి వ్యవహారంలో నాటి టీటీడీ పాలకులతో పాటు ఈెవో కార్యాలయం కూడా నిందితుడిగా మద్దతుగా నిలిచి అపఖ్యాతి మూటగట్టుకుంది. మొత్తంగా టీటీడీలో ఇన్నేసి అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతలపై ఎలాంటి శిక్షలు ఉండబోతున్నాయన్న చర్చ ఆసక్తి రేకెత్తిస్తోంది.











