విడుదల కి ముందే మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ” ఉప్పెన ” సుకుమార్ వద్ద లోగడ పలు సినిమాలకు పని చేసిన సాన బుచ్చి బాబు ” ఉప్పెన ” తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ‘రంగ స్థలం’ స్క్రిప్ట్ వర్క్ లో కూడా బుచ్చిబాబు కీలక పాత్ర పోషించాడని చెబుతుంటారు. ఈ మధ్య ’ఉప్పెన’ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను మెగా స్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు చూశారు. చిరంజీవి చాలా ఎమోషనల్ అయి కంట తడి పెట్టుకున్నారని తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బుచ్చి బాబు వర్క్ కి ఇంప్రెస్ అయి , మంచి కథ తీసుకు వస్తే , డెఫినెట్ గా సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది . బుచ్చిబాబు తన రెండో సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ లో కమిట్మెంట్ ఇచ్చారు . భారీ పారితోషికం అడ్వాన్స్ గా తీసుకున్నారని తెలుస్తోంది. బుచ్చి బాబు రామ్ చరణ్ మెచ్చే కథ చెబితే , ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడం పెద్ద విషయం కాదు.











