మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. మార్చి నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ చేసి మే 9న ‘ఆచార్య’ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక దీని తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని మెహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. ముందుగా సుకుమార్, సుజిత్, వినాయక్ తదితరుల పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ ఫైనల్ గా తమిళ డైరెక్టర్ మెహన్ రాజాకే దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. ప్రముఖ నిర్మాత. ఎన్.వి. ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ నటించనున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. కొత్త సంవత్సరంలో ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి కానీ.. ఎప్పుడు అనేది బయటకు రాలేదు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 21న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించనున్నారని తెలిసింది. ఆతర్వాత మార్చి నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. చిరు రీ ఎంట్రీ రీమేక్ తోనే (ఖైదీ నెంబర్ 150) ఇచ్చారు. బ్లాక్ బస్టర్ సాధించారు. మరి.. ‘లూసీఫర్’ కూడా రీమేక్. ఈ రీమేక్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.











