పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి గ్యాప్ ఇచ్చి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డితో ఓ సినిమా, హరీష్ శంకర్ తో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న పవన్ తో సినిమా చేసేందుకు మహేష్ డైరెక్టర్ ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ మహేష్ డైరెక్టర్ ఎవరంటారా..? వంశీ పైడిపల్లి. అవును.. వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు మహేష్ బాబుకు మంచి పేరు కూడా తీసుకువచ్చింది. దీంతో వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయాలనుకున్నారు. మహేష్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మరో సినిమాని దిల్ రాజు నిర్మించాలి అనుకున్నారు.
త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటే.. లాస్ట్ మినిట్ లో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుంచి వంశీ పైడిపల్లి హీరోల కోసం ప్రయత్నిస్తున్నానే ఉన్నారు కానీ.. సెట్ కావడం లేదు. చరణ్ తో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. సెట్ కాలేదు. ఇప్పుడు పవన్ తో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నాడని తెలిసింది. పవన్ ని క్రిష్ మూవీ సెట్ లో వంశీ కలిసాశారని తెలిసింది. పవన్ కి ఇప్పుడు కొత్త కథలు వినే టైమ్ లేదు. అయినప్పటికీ వంశీ పైడిపల్లి ప్రయత్నిస్తున్నారట. పవన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ తెలియదు. ఒకవేళ వంశీ పైడిపల్లికి ఓకే చెప్పినా చెప్పచ్చు. అయితే.. పవన్ ఓకే చెప్పినా వంశీ పైడిపల్లి రెండేళ్లు ఆగాల్సివుంటుంది.
Must Read ;- నిన్న స్టైలిష్ స్టార్ నేడు మెగాస్టార్, మెగా పవర్ స్టార్