పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కఫూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్ దర్శకత్వంలో భారీ పీరియాడికల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
సీనియర్ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇది పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం . ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. క్రిష్ మాత్రం ఈ మూవీ స్టోరీ గురించి రివీల్ చేయలేదు. ఈ మూవీ ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పచ్చు.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఇక పీరియాడిక్ మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు వేస్తున్నారని తెలిసింది. ఇప్పటి వరకు వైష్ణవ్ తేజ్ తో చేస్తున్న మూవీ పై వర్క్ చేసిన క్రిష్ ప్రస్తుతం పవన్ తో చేస్తున్న మూవీ పై వర్క్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తవ్వడంతో పవన్ తదుపరి చిత్రం ఇదే అని తెలిసింది. అయితే.. జనవరి 4 నుంచి పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ కి స్టార్ట్ చేయనున్నారని సమాచారం.