మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్, ఆచార్య’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఏంటి అనేది మాత్రం అఫిషియల్ గా ప్రకటించలేదు. చరణ్ కోసం కొంత మంది దర్శకులు కథలు రాస్తూ.. ఆ కథలతో చరణ్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల కథలు చెప్పారు కానీ.. ఈ కథలకు చరణ్ నో చెప్పారని తెలిసింది.
‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు చరణ్ ఓకే చెప్పాడని.. ఈ సినిమా గురించి త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే.. తాజాగా విజయ్ డైరెక్టర్ చరణ్ స్టోరీ లైన్ చెప్పారని తెలిసింది. ఇంతకీ విజయ్ డైరెక్టర్ ఎవరంటే.. తమిళ దళపతి విజయ్ తో ‘మాస్టర్’ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్. ఈ సినిమా కంటే ముందు లోకేష్ కార్తితో ఖైదీ సినిమాని తెరకెక్కించాడు.
ఈ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఆతర్వాత విజయ్ తో ‘మాస్టర్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ యూనివర్శల్ హీరో కమల్ హాసన్ తో ‘విక్రమ్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత చరణ్ కి ఫుల్ స్టోరీ చెబుతానని ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. దాదాపుగా ఈ సినిమా సెట్ అయ్యిందనే అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనున్నట్టు సమాచారం.
Also Read: మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్