పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. ఇది బాలీవుడ్ లో సక్సస్ సాధించిన పింక్ మూవీకి రీమేక్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న వకీల్ సాబ్ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. స్టార్ హీరోల సినిమా అంటే.. ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలాగే వారి అంచనాలకు తగ్గట్టుగా స్టార్ హీరోలు కూడా కొన్ని సీన్స్ పెట్టాలనుకుంటారు. ఇంతకీ విషయం ఏంటంటే.. వకీల్ సాబ్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను బాగా పెంచుతున్నారట.
ఇంకా చెప్పాలంటే.. అందులో ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాన్స్ కి పండగే అనేలా ఈ సినిమాలో సీన్స్ ఉంటాయని తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ చేస్తోన్న మరో రీమేక్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. మలయాళంలో విజయం సాధించిన ఈ సినిమాలో అసలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే లేదు. అయితే.. అభిమానుల కోసం ఈ రీమేక్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెడుతున్నారట. ఇందు లో ఫ్యాన్స్ కి కావాల్సిన మసాలా అంతా ఉంటుందట. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారట. ఫ్యాన్స్ కు అయితే.. ఐ ఫీస్ట్ లా ఉంటుంది అంటున్నారు.
ఇందులో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నారు. జనవరి నుంచి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ క్రేజీ మూవీని నిర్మిస్తోంది. పొలాచ్చిలో జరిగే సింగిల్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆగష్టులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ప్లాన్. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పెట్టి బాగానే ఖుషీ చేయనున్నారు.
Muat Read ;- అందరిచూపూ.. పవన్ కళ్యాణ్ విరూపాక్ష వైపే!