సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. దీనికి ‘గీత గోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది కానీ.. లేకపోతే ఈపాటికే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాలి. ఈ నెలలోనే ఈ భారీ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీ తర్వాత మహేష్ తో సినిమా చేయడానికి కొంత మంది దర్శకులు రెడీగా ఉండడంతో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనేది ఆసక్తిగా మారింది.
మహేష్ నెక్ట్స్ మూవీ గురించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తోంది. మహర్షి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వంశీ పైడిపల్లితో మహేష్ మూవీ కన్ పర్మ్ అని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మహేష్ మూవీ ఫిక్స్ అయ్యింది. ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ చేసే సినిమా ఇదే అని టాక్ వినిపించింది. ఇప్పుడు ‘భీష్మ’ సినిమాతో సక్సస్ సాధించిన వెంకీ కుడుములతో మహేష్ మూవీ దాదాపు ఖాయమైందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
వెంకీ చెప్పిన లైన్ మహేష్ కి బాగా నచ్చిందట. వెంటనే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమనడం.. వెంకీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగిందట. త్వరలోనే మహేష్ కి నెరేషన్ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్టు జరిగి ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. వెంకీ కుడుముల లక్కీ ఛాన్స్ దక్కించుకున్నట్టే..