స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో బన్నీ ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ లారీ డ్రైవర్ గా నటిస్తుండడం.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంతో ఈ సినిమా రూపొందుతుండడం.. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుక్కు కలిసి చేస్తున్న సినిమా కావడంతో పుష్ప మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ మూవీ షూటింగ్ ను ప్రస్తుతం ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈస్ట్ మారేడుమిల్లిలో చేస్తున్నారు. ఆమధ్య కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత కరోనా కారణంగా బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడే కంటిన్యూగా షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మారేడుమిల్లి వెళ్లనున్నట్టు సమాచారం. ఇంతకీ ఎందుకంటే.. ఆచార్య షూటింగ్ కోసం. అవును.. ఆచార్య కోసం రామ్ చరణ్ పై చిత్రీకరించనున్న సన్నివేశాలను మారేడుమిల్లిలో షూట్ చేయనున్నారు.
ఆచార్య సినిమాలో మెగాస్టార్ నక్సల్ బ్యాక్ గ్రౌండ్ సీన్లు కొన్ని వున్నాయి. వాటి చిత్రీకరణ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. చరణ్ తో పాటు చిరంజీవి పై కూడా అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పుష్ప మూవీ షూట్ కి గ్యాప్ ఇచ్చి ఆచార్య సినిమా షూటింగ్ చేస్తారని తెలిసింది. మార్చి నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. ఆతర్వాత ఈ భారీ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- మెగాస్టార్ ఆచార్యకు ‘సిద్ధ’మైన రామ్ చరణ్











