తమిళ యాక్షన్ హీరో విశాల్ .. త్వరలో ‘చక్ర’గా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘అభిమన్యుడు’కి ఎక్స్టెండెడ్ వెర్షన్ లాంటి ఈ సినిమాకి యం.యస్ .ఆనందన్ దర్శకత్వం వహించాడు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా… రెజీనా కసండ్రా మరో ముఖ్యపాత్రను పోషిస్తోంది. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
‘చక్ర’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు విశాల్ తెలిపాడు. ఈ సందర్బంగా యూనిట్ సభ్యులు .. తామంతా ఒకచోట చేరి పోజులిచ్చిన ఫోటోని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తానని చెప్పిన విశాల్ .. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అయినా సరే.. అనుకున్న టైమ్ కి అనుకున్నట్టుగా సినిమాను ఓటీటీలో విడుదల చేస్తానంటున్నాడు విశాల్. మరి చక్ర గా విశాల్ ఏ రేంజ్ లో అదరగొడతాడో చూడాలి.
We have successfully wrapped up shoot of #Chakra. The Game Begins. Single track release soon…GBhttps://t.co/7kR7e80e8G@VishalKOfficial @thisisysr @ShraddhaSrinath @AnandanMS15 @balasubramaniem @ReginaCassandra @VffVishal @johnsoncinepro @baraju_SuperHit
— Vishal (@VishalKOfficial) October 10, 2020