తమ ఛానెల్ రేటింగ్ పెంచుకునేందుకు నకిలీ టీఆర్పీ రేటింగ్ స్కామ్ కు పాల్పడిన ఓ ఛానెల్ బాగోతాన్ని ముంబై పోలీసులు కొద్ది రోజుల క్రితం బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నిరంజన్ నారాయణ స్వామి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అభిషేక్ కపూర్ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యారు.
నారాయణ స్వామి ముందుగా కార్యాలయానికి చేరుకోగా, ఢిల్లోలో ఉన్న అభిషేక్ కపూర్ తరువాత చేరుకున్నారని అధికారులు తెలిపారు. అక్టోబర్ 10న రిపబ్లిక్ టీవీ హన్సా గ్రూప్ నకు చెందిన ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఆ పత్రంలో కొన్ని విషయాలు నమ్మదగినవిగా ఉన్నాయి. కాబట్టి వారి వాదనలను రికార్డు చేయావలసిన అవసరం ఉందని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
అసలేం జరిగిదంటే..
తమ టీవీ ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్ పెంచేందుకు ఏకంగా ప్రజలకు డబ్బులు ఇచ్చి తమ ఛానెల్ ను మాత్రమే చూసేలా మీటర్స్ ని అమర్చి అధిక రేటింగ్ పొందుతున్నట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. తాము జరిపిన విచారణలో రెండు ఛానల్స్ తో పాటు ఓ జాతీయ మీడియా కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ముంబై పోలీసుల విచారణలో తెలిసిందని పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు.
ఈ వ్యవహారంలో బార్క్ సంస్థ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. బార్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫేక్ రేటింగ్ వివరాలను పోలీసులు బయటపెట్టారు.
అలాంటి వారికి నగదు ప్రోత్సహకాలు
కేవలం ఒకే ఛానల్ చూస్తామని చెప్పిన వారికి టీవితో పాటు కొంత మేర నగదును కూడా ముట్టజెప్పినట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
ఖండించిన రిపబ్లిక్ ఛానెల్…
నకిలీ టీఆర్పీ రేటింగ్ గురించి ముంబై కమిషనర్ పరమ్ వీర్ వెల్లడించిన వివరాల గురించి రిపబ్లిక్ టీవీ ఛానెల్ ఖండించింది. ఈ ఆరోపణలు అన్ని అవాస్తవాలని తెలిపింది. దీని గురించి ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి స్పందించారు. సినీ నటుడు సుశాంత్ కేసులో తాము ప్రశ్నలు లేవనెత్తినందుకే ఇలా తమ ఛానెల్ పై పరమ్ వీర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అతనిపై పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.
ఇప్పటి వరకు ఎందుకు ప్రస్తావించలేదు…
మా పై ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు బార్క్ ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదులో కూడా తమ పేరును ఎందుకు ప్రస్తావించలేదంటూ ఆయన ప్రశ్నించారు. పరమ్ వీర్ తమకు క్షమాపణలు తెలిపి, చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
సౌత్ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...










