చంద్రబాబు జైలులో ఉన్నా.. పార్టీ కేడర్‌లో నిస్సత్తువ ఆవహించకుండా ప్రయత్నిస్తోంది టీడీపీ హై కమాండ్.. పక్కా వ్యూహరచనతో లోకేష్ పార్టీని నడిపిస్తున్నాము.. నిన్న మోత మోగిద్దాం.. నేడు నిరాహార దీక్షతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు..
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబును అరెస్ట్ చేయించానని చంకలు గుద్దుకుని సంబర పడిపోతున్న జగన్ బ్యాచ్ కు ఇప్పుడు కనీసం నిద్ర కూడా పట్టడం లేదట. బాబును జైల్లో పెట్టించటం బూమరాంగ్ అవుతుందని వైఎస్సార్‌సీపీ కల్లోకూడా ఊహించి ఉండదు. చంద్రబాబు అరెస్ట్ తో ఉవ్వెత్తున ఎగసిపడి ఆందోళన తెలిపిన టీడీపీ శ్రేణులన్నీఇప్పుడు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై వినూత్న రీతిలో నిరసన తెలపటం ద్వారా 2024 ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టాయి. బాబు అరెస్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీని నామరూపాల్లేకుండా చేసేందుకు వైఎస్సార్‌సీపీ చేసిన ప్లాన్లు తిస్పికొట్టేలా ఆ పార్టీ హై కమాండ్ వ్యూహరచన చేసింది.
నిన్నటి వరకూ పార్టీ స్ట్రాటజీ మీటింగ్ లకు దూరంగా ఉండే యువ నేత లోకేశ్ ఇప్పుడు పార్టీని నడిపించే బాధ్యతను మోస్తూ సూపర్ డూపర్ లీడర్ అయిపోయాడు. ఏ మాత్రం మొహమాటం లేకుండా పార్టీ సినియర్లను సైతం తనదైన శైల్లో ప్రశ్నిస్తూ ఓ ఇప్పుడు తిరుగులేని శక్తిగా మారిపోయారు. తండ్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను తూచతప్పకుండా పాటిస్తూ అటు జనసేనను, ఇటు తమ పార్టీ నేతలను కలుపుకుని అధికారం చేపట్టే దిశగా లోకేశ్ అనుసరిస్తున్న వ్యూహాలు సీనియర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో డీలాపడిపోయిందనుకున్న కేడర్ లోకేశ్ వ్యూహాత్మక అడుగుల ద్వారా వెయివోల్టుల శక్తిని పొందినట్టే కనిపిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ కు వివిధ రూపాల్లో నిరసన తెలపాలన్న పార్టీ పిలుపు మేరకు కదిలి వచ్చిన చంద్రదండు
మోత మోగిద్దాం కార్యక్రమంతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైంది. మొన్నటి దాకా పార్టీకి దూరంగా ఉన్న నారా బ్రాహ్మణి సైతం మోతమోగిద్దాం కార్యక్రమంతో జనంలోకి రావటం టీడీపీకేడర్ లో కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. మోత మోగిద్దాం కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడంతో తెలుగుదేశం హై కమాండ్ ఆలోచనతో అమలైన ఒక రోజు నిరహార దీక్షకు అంతకంటే ఎక్కువ స్పందన వచ్చింది.
జైల్లో చంద్రబాబు దీక్షకు లీడర్లతో పాటు జనమంతా సంఘీబావం తెలపటమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే ఉత్సాహంతో మరికొన్ని సంచనల నిర్ణయాలతో టీడీపీ కేడర్ ను బలోపేతం చేసేలా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది. భువనేశ్వరి బస్సుయాత్రలాంటి కార్యక్రమాలు ఈ వ్యూహంలో భాగమే. టీడీపి కార్యక్రమాలకు తోడు జనసేన కూడా కలసి రావటంతో రెట్టించిన ఉత్సాహంతో టార్గెట్ 2024 వైపు వడివడదిగా అడుగులు పడుతున్నాయి. మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ వ్యూహాలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.