చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్భంధించి 24 రోజులు కావస్తున్న సందర్భంగా చంద్రబాబు సత్యయేవ జయతే నిరాహర దీక్షకు పిలుపు నిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడంతో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఢిల్లీలో ఎంపీ కనకమేడల ఇంట్లో లోకేష్ నిరాహార దీక్ష చేపట్టగా.. నారా భువనేశ్వరి రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. అలానే నందమూరి కుటుంబ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ఎస్ ట్రస్ట్ భవనంలో దీక్షలు చెపట్టారు. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం పార్టీ నేతలు నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి జనసేన, సీపీఎం.., సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.
సత్యమేవ జయతే దీక్ష శిబిరంలో పాల్గొన్న ఆల్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వలలతో రగిలిపోయారు. జగన్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాలను ఎండగట్టారు. మరోవైపు సొంత మీడియాలో దీక్షలపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. అయితే స్వచ్ఛందంగా సత్యమేవ జయతే కార్యక్రమానికి వచ్చిన ఆల్ పార్టీ నేతలు అమ్ముడు బోయారని వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాన్ని అందుకుంది. దీంతో రెచ్చిపోయిన కమ్యూనిస్టులు .. మమ్మల్ని కొనే మగాడు ఇంకా పుట్టలేదు రా.. బాతు బచ్చాలు .. అంటూ కౌంటర్ పంచ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు తలపెట్టిన నిరాహార దీక్షలు విజయం సాధించాయి. అన్నీ పార్టీలు ఈ దీక్షకు మద్దతు పలికాయి. రాజకీయాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బయటకు వచ్చి సంఘీభావం తెలిపుతున్నారు. దీంతో రాజకీయ వర్గాలతోపాటు.. అన్నీ వర్గాల వారు సత్యమేవ జయతే నిరాహార దీక్ష గురించి మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం విజయవంతమైయిందనే చెప్పాలి.