రాక్షస గర్వంతో రెచ్చిపోతున్న వైసీపీ మంత్రులు..!
ఏపీలో వైసీపీ మంత్రులు రాక్షస గర్వంతో రెచ్చిపోతున్నారు. ప్రజలను పీడించేందుకే జగన్ ప్రభుత్వమని మంత్రులే ఓపెన్ గా చెప్తున్నారు. మంత్రుల వ్యాఖ్యలకు నేడు సొంతపార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.
సుపరిపాలన ప్రజలకు సుపరిపాలన అందిస్తారని నమ్మి.. 2019లో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు ప్రజలు. కానీ.., ఆ నమ్మకమే నేడు ప్రాణాలను హరించే యమపాశమైంది. సంక్షేమం పేరుతో జరిపే ఆర్ధిక విధ్వంసం ప్రజలకు ప్రాణసంకటలా మారింది. రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాలు జగన్ చెరిచాడు. ఆర్ధికంగా కుదేలయ్యే విధంగా ఆయన అనుసరిస్తున్న విధానాలను చూసి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోటిపై వేలేసుకుంటున్నారు.అందుకే ప్రజలకు ఉపాధి లేక ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు. మరోవైపు నిర్మాణ రంగం భారీగా కుప్పకూలింది. 30 ఏళ్ల నాటి పతనాన్ని రియాల్టర్లు చవిచూస్తున్నారు. నిర్మాణ రంగానికి ప్రధాన వనరుగా ఉన్న ఇసుకను అక్రమంగా బ్లాక్ చేసి..ఆకలి చావులను లెక్కిస్తునాడు జగన్. ఇసుక అక్రమ దందాకు పాల్పడుతూ వేల కోట్ల దోచుకున్నాడు. సామాన్యుడు ఇసుక కొనాలంటే చుక్కలు చూస్తున్న ధరలను చూసి జంకుతున్నాడు.
ఇసుక విధానంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చూసి.. ప్రజలు, భవన కార్మికులు మండిపడుతున్నారు. ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక ధరలు నడ్డి విరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు చేసేందుకు ప్రజలు, బిల్డర్లు ముందుకు రాకపోవడంతో భవన కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. పేదలు ఇళ్ల నిర్మించుకోవాలంటే ట్రక్కు ఇసుక 3,500 పైగా చెల్లించాల్సి వస్తోంది. ఇసుక అధిక ధరపై వైసీపీ నాయకుడు సలాం డిప్యూటీ సీఎం నారాయణస్వామిని నిలదీశాడు. దీంతో ఆయన కోపం ఊగిపోయి.. సదరు నేతపై ఒంటికాలిపై లేచాడు.
చిత్తూరు జిల్లా.., పెనుమలూరు మండలం కలవకుంట పంచాయతీలో ఏపీ ఉప మఖ్యమంత్రి నారాయణ స్వామి గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీటీసీ, వైసీపీ నాయకులు అబ్దుల్ సలాం ఇసుకలో జరుగుతున్న దళారి వ్యవస్ధను ప్రశ్నించారు. ఇప్పటికే ట్రక్కు ధర రూ.3,500 దాటింది.. కొంచెం దగ్గిస్తే బాగుంటుందని మంత్రిని కోరాడు. దీంతో మంత్రికి ఎక్కడలేని కోపం పొంగి వచ్చింది. తన రాక్షసత్వాన్ని ప్రజలతో పాటు ప్రశ్నించి సదరు వైసీపీ నాయకుడిపై చూపాడు. ఇంకా మాట్లాడితే ట్రక్కు ఇసుక ధర రూ.5 వేల చేస్తాం.. ఏం పీక్కుంటావ్! అని బూతుపురాణంతో విరుచుక పడ్డాడు మంత్రి స్వామి. అంతేకాక.., జగన్ గొప్పలు చెప్పుకొస్తూ.. చంద్రబాబు ఉన్నప్పుడు ఏం..? అభివృద్ధి చేశాడని సలాం ను ప్రశ్నించాడు మంత్రి. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ఇసుక ఫ్రీగా ఇచ్చారని సమాధానం చెప్పాడు సలాం. దీంతో మంత్రికి చిర్రెత్తుకొచ్చి.. అక్కడ నుంచి పలాయనం చిత్తగించాడు.
మంత్రి నారాయణ స్వామి మాదిరిగానే .. అన్ని జిల్లాలో మంత్రులు తమ ఫ్రస్టేషన్ ను సొంత పార్టీ వాళ్ళపై చూపుతున్నారు. పార్టీలో జరుగుతున్న లోపాలను సరిచేసుకోవాలని కేడర్ ఒకవైపు సూచిస్తున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు దాన్ని లైట్ తీసుకుంటున్నారు. మాకే సలహాలిస్తారా అంటూ కేడర్ పైనే చిందులు వేస్తున్నారు. అహంకార మాటలతో పార్టీ నాయకులపై దాడికి దిగుతున్నారు. ఇదిలా ఉంటే.. జగన్ ప్రభుత్వ విధానాల వలన తినడానికి తిండి లేకా.. ఉంటానికి ఇల్లు లేక ఏపీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. పేదొడి సొంతింటి కలను విస్మరించి.. విశాఖలో సీఎం అధికార నివాసానికి వందల కోట్లు ఎలా వెచ్చిస్తావ్ అని నిలదీస్తున్నారు. ఇప్పటికైన ఒంటెద్దు పోకడను మాని.. సహజ వనరులను స్వేచ్ఛగా ప్రజలకు అందేలా చూడాలని జగన్ కు సూచిస్తున్నారు. అలానే ఎన్నికల ఎప్పుడు వచ్చిన జగన్ అండ్ కో కు బుద్ధి చెప్పాలని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.











