రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ ప్రాభవం కోల్పోవడంతోనే దాని అనుబంధ మీడియా సంస్థల్లో కూడా చీకట్లు అలుముకుంటున్నాయి. ముఖ్యంగా జగన్ మీడియా సంస్థ సాక్షి టీవీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని స్పష్టమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారానికి దూరం అయిన నాటి నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలను మరీ దారుణమైన రీతిలో సాక్షి ప్రసారం చేస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని జగన్ కు అనుకూలంగా రాస్తుండడంతో ప్రజలకు సైతం విసుగెత్తినట్లుగా ఉంది. అందుకే సాక్షి టీఆర్‌పీ రేటింగ్‌లు బాగా పడిపోయాయి.
తాజా టీఆర్‌పీ రేటింగ్‌ల ప్రకారం సాక్షి టీవీ చానెల్ తన స్థానాన్ని కోల్పోతోంది. సాక్షి టీవీ బృందం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఈ పోటీ మార్కెట్ దాని మనుగడే సవాలుగా మారనుంది. ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత తగ్గుముఖం పట్టడం ముందే ఊహించినదే. కానీ ఆ పతనం ఈ స్థాయిలో ఉందా అని అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సరైన రకమైన ప్రోగ్రామ్‌లు, ఆకర్షణీయమైన రిపోర్టులతో వీక్షకుల ఆసక్తిని కలిగించేలా స్టోరీలు కరవు అవుతున్నాయి. అబద్ధపు స్టోరీలతో ఛానెల్ ప్రైమ్ టైంని నింపేస్తున్నారు. ఫలితంగా టీఆర్‌పీ చతికిలపడుతోంది.
ప్రస్తుతం సాక్షి టీవీ తాజా టీఆర్‌పీ 15.8 కాగా, టాప్ ఛానెల్ టీవీ 9 88.8 టీఆర్‌పీ ని పొందుతోంది. ABC రేటింగ్‌లు ఇంకా విడుదల కానందున సాక్షి దినపత్రిక స్థితి ఇంకా తెలియదు. కానీ, కచ్చితంగా పడిపోతుందని, ఆ పడడం కూడా భారీ స్థాయిలో ఉంటుందని మాత్రం భావిస్తున్నారు. సాక్షి.. తన రాజకీయ పార్టీ విధులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి, ప్రస్తుత వైసీపీ నుంచి పెద్ద స్థాయిలో కార్యకలాపాలు లేకపోతే కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అయితే, టీఆర్‌పీల నివేదిక చూడగానే భారతి ఒంటికాలిపై లేచినట్లు తెలుస్తోంది. కంపెనీ డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పడిపోతున్న ఛానెల్ పరిస్థితి గురించి రివ్యూ చేసినట్లు తెలిసింది. అంతేకాక గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా చెబుతున్నారు. జనరంజక కథనాలు వండి వార్చాలని.. ఎలాగైనా రేటింగ్ పెంచాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలిసింది. మరి భారతి వార్నింగ్ తర్వాత టీమ్ ఎలా పనిచేస్తుందో చూడాలి