తప్పు చేసి ఎదురు దా*డి చేస్తే.. ఇల్లీగల్ పనులు చేసి లీగల్ నోటీసులు పంపితే.. సీఐ శంకరయ్యలా డిస్మిస్ అవుతారు. వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య జరిగిన సమయంలో ఈ శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. హ*త్య గురించి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా గుట్టుగా సీఐ శంకరయ్యను మాత్రమే పిలిపించుకున్న జే గ్యాంగ్ ఆయన డైరెక్షన్‌లో రక్తపు మరకలు, ఇతర సాక్ష్యాలను తుడిపించేశారు. ఈ విషయాన్ని సీబీఐ విచారణలో స్వయంగా శంకరయ్యే ఒప్పుకున్నారు. కానీ నాలుక మడతేసి మాట మార్చడం.. అప్పటి పాలకులు ఆయనకు మంచి పోస్టింగ్ ఇవ్వడం.. ఇప్పుడు అందరికీ తెలిసిన చరిత్ర.
పులివెందులలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరున్నా.. వారు పని చేసేది వైఎస్ ఫ్యామిలీ కోసమే. ఈ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నా.. అక్కడ శంకరయ్యలాంటి వైఎస్ విధేయులు ఉన్నారంటే.. ఆ ఫ్యామిలీకి ఎంత పట్టు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం మారిన తర్వాత వివేకా హ*త్య అనంతరం జరిగిన వ్యవహారాలపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు. హ*త్య కేసుపై సీబీఐ విచారణ జరుగుతోంది. సాక్ష్యులు, విచారణ అధికారులపై జగన్ హయాంలో మోపిన కేసుల వెనుక అసలు ఉద్దేశాలను బయటపెట్టే పనిలో పడ్డారు ఏపీ పోలీసులు. ఇందులో భాగంగా సాక్ష్యాలను చెరిపేసిన సీఐ శంకరయ్యను వీఆర్‌కు పంపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు.. వివేకా హ*త్య కేసు గురించి మాట్లాడితే.. ఏకంగా సీఎంకే లీగల్ నోటీసులు పంపించారు సీఐ శంకరయ్య. ఒక ఇన్పెక్టర్ స్థాయి అధికారి ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపారంటే.. అతని వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయనే ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. వీఆర్ ఉన్న సీఐ గీత దాటారని భావించి ఉన్నతాధికారులు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారు. సర్వీసు నుంచి డిస్మిస్ చేసి ఇంటికి పంపించారు. ఇప్పటి వరకు యూనిఫామ్ వేసుకొని.. వివేకా హం*తకుల కోసం పని చేసిన శంకరయ్య ఇప్పుడు.. డైరెక్టుగానే వారికి సేవ చేసుకోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..











