రొమాన్స్ ఎంత హాటుగా ఉంటే కుర్ర కారు అంత ఘాటుగా స్పందిస్తారు. అందుకేనేమో ఈ తరహా వెబ్ సిరీస్ లే ఎక్కువ రూపొందుతున్నాయి. లెస్బియన్స్ కథాంశంతో ఈ తరహా వెబ్ సిరీస్ ఒకటి రూపొందుతోంది. దాని పేరు ‘పి సే ప్లెజర్’. హిందీలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ఇతర భాషల్లోకి కూడా అనువందించే ఆలోచన ఉంది. ఈ సిరీస్ టీజర్ ఇటీవలే విడుదలైంది. సోషల్ మీడియాలో ఈ టీజర్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఒడియా అమ్మాయి సింధూర రౌత్ ఇందులో మెయిన్ లీడ్ గా నటిస్తోంది.

ఈ అమ్మాయి ఇంతకుముందు అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఏక్తా కపూర్ కు చెందిన బాలాజీ టెలిఫిలిమ్స్ లో పనిచేసిన అవినాష్ రౌత్ బయటికి వచ్చేసి ఏఆర్ ప్రైమ్ యాప్ తో కొత్త దుకాణం తెరిచారు. దాని కోసమే ఈ హాట్ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. దీనికి అవినాష్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో అనేక హిందీ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఈ సిరీస్ అనేక ట్విస్టుులతో ఉంటుందట. మరి ఏ నేపథ్యంలో లెస్బియన్స్ ను ఇందులో చూపిస్తారో చూడాలి.











