November 11, 2025 1:36 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture

వాల్మీకి ఎవరు? ఎక్కడివాడు?

శ్రీరాముడి జీవనయానమే రామాయణం. ఆ మహాగ్రంథమే లేకుంటే రాముడెవరో మనకు తెలిసేది కాదు. అలా తెలిసేలా చేసిన వ్యక్తి వాల్మీకి. ఈ వాల్మీకి వెనుక భిన్న కథనాలు ఉన్నాయి. అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.

October 31, 2020 at 11:29 AM
in Culture, Latest News, Spiritual
Who is Valmiki

who is valmiki

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున వాల్మీకి జయంతిగా జరుపుతుంటారు. ఈరోజు అక్టోబరు 31న వాల్మీకి జయంతి. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం.

శ్రీరాముడు అనే మహాపురుషుడి వృత్తాంతాన్ని రామాయణంగా రాసింది ఎవరంటే ఎవరైనా వాల్మీకి మహర్షి అని ఠక్కున చెప్పేస్తారు. ఈ నెల 31వ తేదీ వాల్మీకి జయంతి. అసలు ఈ వాల్మీకి ఎవరు? ఏమా కథ అనే విషయాలను తెలుసుకుందాం. సంస్కృతంలో మొట్టమొదటి కవి వాల్మీకి. శ్లోకం అనే ప్రక్రియను కనుగొన్నది కూడా ఈయనేనంటారు.
వల్మీకం అంటే పుట్ట. ఆ పుట్ట నుంచి వెలుపలికి వచ్చిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడని కూడా అంటారు.

వాల్మీకి తల్లిదండ్రుల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు తాను పరాశరుడి కుమారుడినని తన రచనల్లో చెప్పుకున్నారు. కానీ వాల్మీకి ఎక్కడా తల్లిదండ్రుల గురించి ప్రస్తావించలేదు. అయితే సీతను రాముడికి అప్పగించే సమయంలో తన గురించిన ప్రస్తావన చేశాడు. ఉత్తరాకాండలో ఉన్న విషయం ఏమిటంటే ‘రామా నేను ప్రచేతనుడి ఏడో కుమారుడిని. వేల సంవత్సరాలు తపస్సు చేసి ఏ పాపమూ చేయలేదు, ఎలాంటి అబద్దమూ ఆడలేదు. సీత నిన్ను తప్ప వేరే పరపురుషుడిని ఎరుగదు. నా మాట అబద్ధం అయితే నేను చేసిన తపస్సు అంతా పోతుంది’ అంటాడు.

ఇంతకీ ఈ ప్రచేతనుడు ఎవరు? ఆయనది ఏ వంశం? లాంటి విషయాలను కూడా తెలుసుకోవాలి. ‘శ్రీమద్భాగవతం’ లో అతని ప్రస్తావన ఉంది. దీన్ని వేదవ్యాసుడు రాశాడు. రామాయణం త్రేతాయుగంలో జరిగితే భాగవతం రాసిన వేదవ్యాసుడు ద్వాపర యుగం నాటి వాడు. ఇది ఎలా రాశాడన్న ప్రశ్న కూడా కలుగుతుంది. పురాణ రచయితలను భగవంతులుగానే భావిస్తారు. అది ఏ యుగమైనా ఒకటే కదా. ఆ భగవంతుడే వాల్మీకిగానూ, వేదవ్యాసుడిగానూ జన్మించి పురాణాలు రాశాడంటారు. ప్రచేతనుడు చేస్తున్న సత్రయాగంలో నారదుడు గానం చేసినట్లు చెప్పారు కదా.. అతను ఎవరు? వారి కుమారులు ఎవరు? అని విదురుడు మైత్రేయునితో అడిగే సందర్భంలో ఈ ప్రశ్న కనిపిస్తుంది. ఇక్కడ తెలిసింది ఏమిటంటే ప్రచేతనుడు విష్ణుభక్తుడు. అతను క్షత్రియుడు. ఆయనకు యజ్ఞయాగాల గురించి నారదుడు ఉపదేశించారు.

ఆ తర్వాత కథా క్రమంలో ధ్రువుడి తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమై వరాలివ్వడంతో ధ్రువ వంశ విస్తరణ జరిగింది. వీరు సూర్యవంశస్తులైన బోయలు. వీరి వంశ క్రమం వత్సరుడు , పుష్పార్ణుడు , సాయంకాలుడు , చక్షుడు , ఉల్కకుడు , అంగుడు , వేనుడు , పృథ్వీరాజు , విజితాశ్వుడు , పావనుడు , హవిర్ధానుడు , ప్రచేతసుడుగా చెబుతారు. ఈ ప్రచాతనుడికి పది మంది ప్రాచేతసులు అని ఉంది. వీరి జన్మవృత్తాంతాలు చూస్తే అంగుడి బాధ , వేనుడి దుశ్చర్యలు , పృథ్వీ రాజు ఔన్నత్యం , నిషాదుడు అడవులలోకి వెళ్లిపోయి కిరాత రాజవ్వటం జరుగుతుంది. ప్రచేతసుడికి జన్మించిన ఆ 10 మంది ప్రాచేతసులలో 7వ వాడు వాల్మీకి మహర్షి. నారదుల ఉపదేశంతో తండ్రి , తాతల , ముత్తాతల పూర్వజన్మ సుకృతం, శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా మార్చాయి. వాల్మీకిమహర్షికి సంబంధించిన అసలు కథ ఇది.

వాల్మీకి మీద ఎవ్వరూ పెద్దగా పరిశోధనలు చేయకపోవడంతో కట్టుకథలు పుట్టాయి. వాల్మీకి పేరు రత్నాకరుడని, అతను దొంగ , దారి దోపిడీదారుడంటూ పేర్కొన్నారు. మరి కొందరు ఆయన బ్రాహ్మణుడన్నారు. వాల్మీకి అనే శబ్దానికి చీమలపుట్ట అనే అర్థం ఉంది. కఠోర ధ్యానం చేసి పుట్ట పేరుకునేలా తపోముద్రలో ఉన్నాడు కాబట్టి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. ఆయన మాంసాహారి కాబట్టి కిరాతుడు అని పేరు వచ్చిందంటారు. కిరాతుడు రిషిగా మారడం జరుగుతుంది కదా. వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని మరికొందరంటారు. వారిలో రత్నాకరుడు , అగ్నిశర్మ కూడా ఉండి ఉండవచ్చు. వీరు ఆదికవి వాల్మీకి బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ఉండే అవకాశం కూడా ఉంది.

వాల్మీకిమహర్షి ‘ఓం ఐం హ్రీం క్లీo శ్రీo’ అనే బీజాక్షరాలను సరస్వతీ , లక్ష్మి , మాయ కటాక్షాన్ని కలుగచేసే మంత్రాలను లోకానికి పరిచయం చేశారు. వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికం చేసిన భరద్వాజుడు , లవుడు , కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారట. బ్రహ్మ సమానుడని , రామాయణాన్ని రాయటానికి బ్రహ్మ తానే వాల్మీకి మహర్షిగా అవతరించాడని నమ్మేవారు కూడా ఉన్నారు. ఆదికవి వాల్మీకి ఆ రోజులలోనే ‘అక్షరలక్ష’ అనే ఈనాటి ఎన్ సైక్లోపెడియా ఆఫ్ బ్రిటానికా లాంటి విజ్ఞాన సర్వస్వన్ని అందించారు.  యోగవాశిష్టం అనే యోగా , ధ్యానం గురించిన మరో పుస్తకాన్ని కూడా వాల్మీకి రాశారు.

ఈ పుస్తకం రామాయణంలో భాగమే. రాముడు పది – పన్నెండేళ్ల వయసులో మానసిక అశాంతికి లోనైనప్పుడు వశిస్టుడి ద్వారా యోగా , ధ్యానం శ్రీరాముడికి బోధించారు. వశిస్టుడు పలికిన విషయాలనే వాల్మీకి రాశాడు. ఆదిత్య హృదయం రాసింది కూడా వాల్మీకి మహర్షే. వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడినని వాల్మీకి పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు , సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ – కుశలను కన్నట్టు ఉంది. వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తోంది.

మహర్షిగా మారిన వాల్మీకి దండకార్యణం గుండా దక్షిణ భారతదేశం , ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడని చెబుతారు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూఅడవి ఆకులు , దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో రాశాడని అంటారు. తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదీ తీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడట. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడని చెబుతారు పరిశోధకులు. వాల్మీకి జీవితం శ్రీలంకలోనే ముగిసింది.

– హేమసుందర్ పామర్తి

Tags: ashwayuja masam in telugulord ramalord sriramaramayanamsaraswati devitelugu newsvalmiki biographyvalmiki booksvalmiki castevalmiki jayanti 2020valmiki jayanti date of birthvalmiki maharshivalmiki storywho is valmiki
Previous Post

అందుకోసమే మతం మారడం సరికాదు: కోర్టు

Next Post

‘ఆర్.ఆర్.ఆర్’ కోసం గొంతు సవరించుకుంటోన్న సీత ?

Related Posts

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

by లియో డెస్క్
November 10, 2025 2:15 pm

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు మధ్య...

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

by లియో డెస్క్
November 9, 2025 5:50 pm

వైసీపీ అధినేత జగన్‌రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే...

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

by లియో డెస్క్
November 9, 2025 5:00 pm

ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చారంటే అది పార్టీ...

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

by లియో డెస్క్
November 9, 2025 3:55 pm

టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌... జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక...

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

by లియో డెస్క్
November 8, 2025 6:58 pm

కర్నూలులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం మెడకు చుట్టేందుకు వైసీపీ విశ్వ...

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

by లియో డెస్క్
November 8, 2025 1:52 pm

నారా లోకేష్‌ జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కూటమి...

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

by లియో డెస్క్
November 7, 2025 8:06 pm

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియాని గెలిపించిన మహిళా క్రికెటర్‌ శ్రీచరణిని ఏపీ ప్రభుత్వం...

అనంతలో కియా రికార్డ్‌ 6 ఏళ్లలో సాధించిన ప్రగతి ఇది..!

by లియో డెస్క్
November 7, 2025 5:55 pm

కియా.. మేడ్‌ ఇన్‌ ఆంధ్రా కారు.. ఈ కార్ల ఫ్యాక్టరీ ఏపీకి రావడానికి...

లోకేష్ ప్రజా దర్బార్‌ సూపర్‌ హిట్‌… ఫీడ్ బ్యాక్ అదుర్స్..

by లియో డెస్క్
November 5, 2025 9:00 pm

మంత్రి నారా లోకేష్..ఎంత బిజీగా ఉన్నా, సామాన్యుల కోసం, కార్యకర్తల కోసం తన...

నారా భువనేశ్వరికి లండన్‌లో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్‌..

by లియో డెస్క్
November 5, 2025 1:46 pm

సీఎం చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లో భువనేశ్వరి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Megastar Chiranjeevi New Look Very Charm & Stylish

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

నారా భువనేశ్వరికి లండన్‌లో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్‌..

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Nandamuri Bala Krishna Narthanasala Movie Pics

‘ఇన్ సైడర్’తో కానిది ‘ఫైబ‌ర్’తో అవుతుందా?

ముఖ్య కథనాలు

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

అనంతలో కియా రికార్డ్‌ 6 ఏళ్లలో సాధించిన ప్రగతి ఇది..!

లోకేష్ ప్రజా దర్బార్‌ సూపర్‌ హిట్‌… ఫీడ్ బ్యాక్ అదుర్స్..

నారా భువనేశ్వరికి లండన్‌లో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

అనంతలో కియా రికార్డ్‌ 6 ఏళ్లలో సాధించిన ప్రగతి ఇది..!

లోకేష్ ప్రజా దర్బార్‌ సూపర్‌ హిట్‌… ఫీడ్ బ్యాక్ అదుర్స్..

నారా భువనేశ్వరికి లండన్‌లో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్‌..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తిరువూరు పంచాయితీపై చర్యలకు రంగం సిద్ధం.. బాబు దగ్గరికి ఫైల్‌..!

జగన్‌ ఒక్కసారి.. కోర్టు మెట్లెక్కితే..?

పార్టీ ఫస్ట్‌.. కార్యకర్తే బాస్‌..!

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌..

ఫేక్‌ ప్రచారం వెనుక మాస్టర్‌మైండ్‌..పూడి శ్రీహరికి నోటీసులు..!

నేషనల్ పాలిటిక్స్‌లోకి లోకేష్‌..బిహార్‌లో ప్రచారం!

రెండున్నర కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగం.. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఘన సత్కారం..!

అనంతలో కియా రికార్డ్‌ 6 ఏళ్లలో సాధించిన ప్రగతి ఇది..!

లోకేష్ ప్రజా దర్బార్‌ సూపర్‌ హిట్‌… ఫీడ్ బ్యాక్ అదుర్స్..

నారా భువనేశ్వరికి లండన్‌లో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist