వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి గురువారం కోర్టుకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్‌పై ఉన్న జగన్ రేపు హైదరాబాద్‌లో CBI ప్రత్యేక కోర్టుకు వెళ్లనున్నారు. వ్యక్తిగతంగా హాజరుకాలేనని జగన్ దాఖలు చేసిన మెమోపై విచారించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవాల్సిందేనని కోర్టు స్పష్టం చేయడంతో..జగన్ కోర్టు మెట్లు ఎక్కనున్నారు. కోర్టు విధించిన గడువుకు ఒక రోజు ముందే విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు జగన్.
చివరిసారిగా ముఖ్యమంత్రి హోదాలో 2020, జనవరి 10న విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆరేళ్లుగా కోర్టుకు జగన్ హాజరుకావడం లేదు. తర్వాత సీఎం పదవిని అడ్డుపెట్టుకుని ఇప్పటి వరకు కోర్టుకు వెళ్లకుండా తప్పించుకున్నారు. ముఖ్యమంత్రిగా తనకు భద్రత అవసరమని..పాలనా బాధ్యతల నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కాలేనంటూ అప్పట్లో పిటిషన్ దాఖలు చేసి CBI స్పెషల్ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారు. 2024, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా CBI స్పెషల్ కోర్టు ముందు హాజరుకాకుండా వాయిదాలు వేయించుకునే ప్రయత్నాలు చేశారు.
గత నెలలో యూరప్ పర్యటన కోసం కోర్టు అనుమతి తీసుకున్నారు జగన్. ఐతే పర్యటనకు వెళ్లేముందు తప్పుడు ఫోన్ నంబర్ సమర్చించారు జగన్. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక కోర్టు సైతం జగన్‌కు కొన్ని షరతులు విధించింది. యూరప్ పర్యటన ముగించుకుని రాగానే కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలని కండీషన్ పెట్టింది. ఐతే యూరప్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత జగన్ కోర్టు ఆదేశాలను పట్టించుకులేదు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, తన తరపున లాయర్ హాజరవుతారని చెప్పారు. కుదరదు అంటే..వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధమని చెప్పారు జగన్. ఐతే ఈ రిక్వెస్ట్‌పై CBI అభ్యంతరం చెప్పింది. దీంతో జగన్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది కోర్టు. వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సిందేనని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో విచారణకు హాజరవుతానని చెప్పారు జగన్.
2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత హైదరాబాద్‌కు రావడం పూర్తిగా మానేశారు జగన్. బెంగళూరు ప్యాలెస్‌కు పరిమితమయ్యారు. కేసీఆర్ కింద పడిన సమయంలో పరామర్శించేందుకు చివరిసారిగా హైదరాబాద్ వచ్చారు జగన్. రాజకీయ పర్యటనలు ఉంటే తప్పితే ఏపీలో అడుగుపెట్టడం లేదు. గతంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లో CBI కోర్టుకు హాజరయ్యేవారు జగన్. దీనిపై సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడిచేవి











