ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజీకి ఏబీఎన్, టీవీ5, ఈటీవీలకు అనుమతి నిరాకరించారు. ఆ మూడు ఛానళ్లకు అసెంబ్లీ సమావేశాల కవరేజీకి అనుమతించకపోవడంపై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను కాలరాయడం దారుణమని చంద్రాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మూడు ఛానళ్లను కూడా అనుమతించాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. మూడు ఛానళ్లను మాత్రమే అసెంబ్లీ సమావేశాల కవరేజీకి అనుమతించకపోవడంపై జర్నలిస్టు సంఘాలు తప్పుపడుతున్నాయి. వెంటనే అన్నీ ఛానళ్లను అసెంబ్లీ కవరేజీకి అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ మూడు మీడియా సంస్థలపై ప్రభుత్వ పెద్దలు అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే.. అసెంబ్లీ సమావేశాలకు అనుమతించలేదు.











