ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా ఇటీవల కరోనాతో కన్నుమూసిన గానగంధర్వుడు ఎస్పీ బాలుకు సభ సంతాపం తెలిపింది. కళామతల్లికి బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవలను స్పీకర్ గుర్తుచేశారు. కాసేపు సభ్యులందరూ మౌనం పాటించి బాలుకు సంతాపం తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ప్రణబ్ ముఖర్జీ సేవలను స్పీకర్ తమ్మినేని గుర్తుచేశారు. ప్రణబ్ మృతికి సభ సంతాపం తెలిపింది. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు దాట్రాజ్, రావి రవీంద్రనాథ్, వెంకటచంద్రమోహన్, పైడికొండల మాణిక్యాలరావు, దిరిశాల రాజగోపాల్ రెడ్డి, అమ్మిరాజు, నారాయణస్వామి, కూనపురెడ్డి వీరరాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాద్ రావు, పూడు మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్, మోచర్ల జోహార్, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, డి.ఎ.సత్యప్రభకు సంతాపం తెలిపారు. అనంతరం సభను పది నిమిషాలు వాయిదా వేశారు.