ఐపీఎల్ కోసం యావత్ క్రికెట్ లోకం నిరీక్షిస్తోంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. క్రీడాభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. అయితే.. మైదానాల ఎంపికపై అటు ప్రాంచైజీల్లో.. ఇటు అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏ ఫ్రాంచైజీకి సొంతగడ్డ కాని అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేయడంపై మూడు జట్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
ఆరు నగరాల్లో ఐపీఎల్!
ఐపీఎల్–2021కు సంబంధించిన ఏర్పాట్లలో బీసీసీఐ వేగం పెంచింది. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆరు నగరాల్లో లీగ్‌ను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఈ మేరకు చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ లేకుండా మ్యాచ్‌ల నిర్వహణకు మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతో.. ముంబైని కూడా తర్వాత లిస్టులో చేర్చింది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ పాలక వర్గం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయలేద
బీసీసీఐ తీరుపై ఫ్రాంచైజీల అసహనం..
దేశవ్యాప్తంగా ఆరు వేదికల్లో బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ, అహ్మదాబాద్ వేదికల్ని ప్రాథమికంగా ఎంపిక చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ముంబయిలోనూ మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచనలో ఉంది. ఈ పరిణామాలపై హైదరాబాద్, రాజస్థాన్, పంజాబ్ ఫ్రాంచైజీలు ఆగ్రహం వ్యక్తం జేస్తున్నాయి. ‘‘ఈ నిర్ణయం మా మూడు జట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని అంటున్నారు.
సొంతగడ్డపై సత్తా..
‘‘సొంతగడ్డపై సత్తా చాటుతున్న జట్లే ఐపీఎల్‌లో రాణిస్తున్నాయి. సొంతగడ్డపై ఐదు లేదా ఆరు విజయాలు నమోదు చేస్తూ ప్లేఆఫ్‌కు దూసుకెళ్తున్నాయి. బీసీసీఐ నిర్ణయంతో బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, దిల్లీ, ముంబయి జట్లకు స్థానిక అనుకూలత లభిస్తుంది. మేం అన్ని మ్యాచ్‌ల్ని బయటే ఆడాల్సి ఉంటుంది’’ అని ఒక ఫ్రాంచైజీ అధికారి వ్యాఖ్యానించారు. ఏ ఫ్రాంచైజీకి సొంతగడ్డ కాని అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేయడంపై మూడు జట్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం జేస్తున్నాయి.
‘ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతారు..’
ఫ్రాంచైజీ ఓనర్స్ వద్ద కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. ఐపీఎల్‌కు సంబంధించిన అన్ని విషయాలను మీడియాలో చూసే తెలుసుకుంటున్నాం. వేదికలు, షెడ్యూల్, టైమ్ గురించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మా హోమ్ సిటీలో మ్యాచ్‌లు లేకపోవడం వల్ల ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతారు. మా నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించకపోవడం ఇది రెండో ఏడాది అవుతుంది. దీనివల్ల ఫ్రాంచైజీలకు బాగా నష్టం వస్తుంది.
– ఫ్రాంచైజీ మెంబర్
Also Read : ఐపీఎల్ 2021: ఏయే ఫ్రాంచైజీల్లో ఎవరెవరు ఆడనున్నారంటే!