తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత…బతుకమ్మ వేడుకలతో యాక్టివ్ పాలిటిక్స్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత కవిత రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు నిత్యం వార్తల్లో ఉండే కవిత…ఓటమి చవి చూసినప్పటి నుంచి అంతగా వార్తల్లో కనబడ్తలేరు. ఎప్పటి నుంచే ఆమె మళ్ళీ తెలంగాణ పొలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి పార్టీకి మరింత మైలేజ్ తీసుకొచ్చి, నిజామాబాద్ జిల్లాలో మళ్లీ చక్రం తిప్పుతారనుకుని అభిమానులు అంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆమె మాత్రం కొంతకాలంగా సైలెంట్ గానే ఉండిపోతూ వస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తాను తప్పనిసరిగా గెలుస్తా అని ఆశించారు. కానీ అనూహ్యంగా బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలవడంతో, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ బతుకమ్మ వేడుకలతో రాజకీయం రంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
బతుకమ్మ వేడుకలతో రీ ఎంట్రీ…
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మళ్లీ యాక్టివ్ గా పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇచ్చి పార్టీలో తన పరపతి పెంచుకోవాలని కవిత డిసడైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బతుకమ్మ వేడుకలతో రీ ఎంట్రీ ఇవ్వాలని తన అభిమానులు కవితకు కోరినట్లు తెలుస్తోంది. బతుకమ్మతో కవిత రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందింది. తాను ఎంపిగా ఉన్ననాళ్లు, అంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను నిర్వహేంచేది. కానీ తను ఓటమి చవిచూసినప్పటి నుంచి రెండేళ్లుగా బతుకమ్మ వేడుకలను కవిత అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. దీనిపై తన అభిమానులు అసంతృప్తి తో ఉంటూ వస్తున్నారు. దసరా పండుగ దగ్గర పడుతుండటంతో మళ్లీ అదే స్థాయిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని కార్యకర్తలు ఆమెను కోరినట్లు తెలిసింది. అయితే ఈసారి వేడుకలను మాత్రం గ్రాండ్‌గా నిర్వహించడంతోపాటూ, ఎమ్మెల్సీగా యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చి రాజకీయంగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు కవిత ప్లాన్ చేసుకున్నట్లు కార్యకర్తలు అంటున్నారు.
ఎమ్మెల్సీతో చట్టసభలో అడుగు…
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉండడంతో ఆయన ఒత్తిడి మేరకు కవిత మళ్లీ పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఆమె ఎన్నిక దాదాపు ఖాయమని అంటున్నారు. ఎమ్మెల్సీగా గెలిచి క్యాబినెట్ లో మంత్రి పదవి చేపట్టి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అపపటి వరకు వెయిటింగ్ చేయడం కంటే, బతుకమ్మ సంబురాలతో ప్రజల్లోకి వెళ్లడమే మంచిదనే ఆలోచనతో కవిత ఉన్నారని తెలిసింది. కవిత పొలిటికల్ రీ ఎంట్రీ బతుకమ్మ వేడుకలతో ఇస్తే పార్టీలో నూతన ఉత్సాహం వస్తుందని టిఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు
అడపాదడపా కార్యక్రమాలు మినహా సేవా కార్యక్రమాల్లో జాగృతి సంస్థ కొంతకాలంగా చురుకుగా పనిచేయడంలేదు. తెలంగాణ జాగృతిని పటిష్టం చేసి దూకుడు పెంచాలని కవిత భావిస్తున్నారట. సేవాకార్యక్రమాలతో పాటు త్వరలో బతుకమ్మ వేడుకలను పెద్దగా నిర్వహించేలా నాయకులకు కవిత ఆదేశాలను జారీ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ప్రత్యర్థుల కదలికలు, వారి రాజకీయ వ్యవహారాలపైన కూడా ఆమె నిఘా పెట్టారు. లాక్ డౌన్ సమయంలో జాగృతి తరపున వివిధ వర్గాలకు ఆర్థిక సాయం అందించిన కవిత జాగృతి ద్వారా చేపట్టే బతుకమ్మ, ఇతర కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా ఆమె ప్రణాళికలు రచించుకొని రాజకీయాల్లో మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది.











