రాష్ట్రానికి నాస్తికుడు.., అన్యమతస్తుడు ముఖ్యమంత్రిగా ఉంటే సనాతన హిందూ సాంప్రదాయం ఏ స్థాయిలో సర్వనాశనం అవుతోందని ఏపీలో నడుస్తున్న ప్రస్తుత రాజకీయాలు ఇట్టే తెలియజేస్తాయి. జగన్ ఈ నాలుగునరేళ్ళ పాలనలో హిందూ దేవాలయాలు.., దేవాత విగ్రహాలు.., స్వామివార్ల రథాలు ఏ స్థాయిలో విధ్వంసాలకు గురయ్యాయే అందరూ చూశారు. పురాణ తార్కాణంగా నిలుస్తున్న తిరుమలలో కూడా అన్యమతస్తుల పెత్తనంతో హైందవ సంప్రాదాయం మంట కలిసిపోతోందని ధార్మిక సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులును పురష్కరించుకుని ప్రభుత్వం అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అమ్మవారి దర్శనం వీఐపీ టికెట్లను అమ్మకానికి పెట్టారు.
వీఐపీ దర్శన టికెట్లు వేలల్లో ధరను కేటాయించి అమ్మకాలు జరుపుతున్నారు. మరోవైపు నకిలీ వీఐపీ దర్శన టికెట్లు కూడా దుర్గమ్మ ఆలయంలో చెలమణి అవ్వడం విశేషం. వేర్వేరు డిపార్ట్మెంట్స్ నుంచి నకీలి విఐపీ పాసులను తీసుకొచ్చి.. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు.మరోవైపు నవరాత్రులు మొదలైన నాటినుంచి బెజవాడ కొండపై నకిలీ పాసుల దందా హద్దుమీరుతోంది.
ఇంకో వైపు ఈవో తీరును సైతం భక్తులు తప్పుపడుతున్నారు. పైసలకు పాసులు అమ్మకుంటున్నారని ఈవోపై భక్తులు మండిపడుతున్నారు. కొండపై ఆన్ లైన్ పే మెంట్లను నిలిపివేశారు. ఎక్కడ యూపీఐ ద్వారా ఆన్ లైన్లో నగదు చెల్లించే వెసులుబాటును కూడా ఎత్తివేశారు. ఎక్కడ క్యూఆర్ స్కానింగ్స్ లేవు. దీంతో భక్తులు ఆన్లైన్ పేమెంట్స్ కు తీవ్ర ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారు. సామాన్యులకు దుర్గమ్మ దర్శనం 15 గంటల సమయం పడుతోంది. కానీ క్యూలైన్స్ భక్తులకు ఎటువంటి వసతులు కల్పించకలేక ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు చేతులెత్తేశారని ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి.
ప్రైవేటు వ్యక్తుల దందా, పెత్తనం బాగా పెరగడంతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం గగనమవుతోంది. ట్రస్ట్ బోర్డులో ఓ వ్యక్తి ఈ దందాలకు.., నకిలీ విఐపీ పాస్ కు సూత్రదారిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.