మాజీ మంత్రి.. సీనియర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది.
ఏపీలో జగన్ రెడ్డి చర్యలకు ఆ పార్టీ సీనియర్లందరూ తలో దారి చూసుకుంటున్నారు. ఈ విషయంలో మంత్రుల పరిస్ధితి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎమ్మెల్యేలు సైతం జగన్ రెడ్డికి.., పార్టీకి దూరంగా జరిగిపోతున్నారు. ఒంగోలులో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రాజకీయాలు వైసీపీ భవిష్యతుపై తీవ్ర ప్రభావం చూపనున్నాయా…? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. జగన్ ను సీఎం చేయడానికి ఆనాడు ఆయన కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పదవీని సైతం త్యాగం చేసి.. వెన్నుదండుగా నిలబడ్డాడు. కానీ అటువంటి వ్యక్తికే నేడు వైసీపీలో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకే కాదు సీనియర్లందరికీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదు. పోనీ కలుద్దామని వచ్చినా పీఏలతో మాట్లాడి వెనక్కి పంపిస్తారు. వీటితో పాటు ఆ మొన్న ఒంగోలులో బాలినేనికి తెలియకుండానే ఆయన కేడర్ లోని నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇవన్నీ పర్యావసానాల నేపధ్యంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే బాలినేని పార్టీ కార్యక్రమాలకు.., జగన్ కు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే బాలినేని తన గన్ మెన్స్ కూడా ప్రభుత్వానికి అప్పగించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న బాలినేని తన వాహనంలో నేరుగా తాడిపల్లి చేరుకున్నారు. అక్కడ కూడా బాలినేని నిరాశ ఎదురైంది.
ప్రస్తుతం జగన్ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో చేదోడు కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే సీఎంవో కార్యాలయానికి చేరుకున్న బాలినేని సీఎంవో అధికారి ధనుంజయ్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు జగన్ తో భేటీకానున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ మధ్యాహ్నం కోడాలి నాని బంధువుల వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలినేనిని కలిసేందుకు ఇష్టం లేకనే ఇలా వేరే కార్యక్రమానికి జగన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.