వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది.. ఏకంగా 125 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.. రాజమోహన్ రెడ్డికి చెందిన కేఎమ్‌సీ కన్ స్ట్రక్షన్స్‌లో మూడు రోజులపాటు సోదాలు చేసిన అధికారులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మోసం చేశారని కీలక ఆధారాలు సేకరించారు.. దీనిపై కేసు నమోదు చేశారు..
రాజమోహన్ రెడ్డికి చెందిన కేఎమ్‌సీ కన్ స్ట్రక్షన్ నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియాని మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. ఈ కంపెనీ చేపట్టిన నేషనల్ హైవేస్ నిర్మాణంలో పలు అవకతవకలు చోటు చేసినట్లు ఫిర్యాదులు అందాయి.. ఈ సంస్థ పలు చోట్ల రోడ్లు, బస్ షెల్టర్‌లు నిర్మించకుండానే, నిర్మించినట్లు చూపించి సొమ్ము చేసుకుంది.. వీటిపై టోల్ కూడా పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ల నుండి వసూలు చేస్తోంది.. ఇటు బస్ షెల్టర్లపై నిబంధనలకు విరుద్ధంగా అడ్వర్‌టెయిజింగ్ బోర్డులు లీజ్‌కి ఇచ్చారని తేల్చింది..
ఈ సంస్థ కేరళలో నిర్మించిన హైవేస్‌పై ఈ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.. కేఎమ్‌సీ కన్‌స్ట్రక్షన్స్ కార్యకలాపాలు ఎమ్‌ఎల్‌ఏ విక్రమ్ రెడ్డి చూసుకుంటున్నారు.. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి ఆయన ఈ మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.. తాము తీసుకున్న రోడ్లపై పనులు జరిగినా, జరగకపోయినా వాటిని పూర్తి చేసినట్లు ఇండిపెండెంట్ ఇంజనీర్లతో కలిసి ఆయన అక్రమాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ ఏకంగా 125కోట్లకుపైగా ఉంటుందని లెక్కలు కట్టారు.. దీనిపై కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు..
మేకపాటి కుటుంబంపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి.. తాజా కేసు వీటిపై మరింత బలాన్ని పెంచుతోంది.. మరి, దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చర్చనీయాంశంగా మారుతోంది..