
చూపరులు ఎంతటివారైనా ఒక్కసారి చూస్తే ఇక చూపు తిప్పుకోలేకుండా చేయడమే నిధి ఎక్స్ పోజింగ్ గ్లామర్ లోని అసలు సిసలు రహస్యం హైదరాబాద్ లో పుట్టి, బెంగళూర్ లో పెరిగిన ఈ ఉత్తరాది భామ తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషలలలో ఎంచక్కా ముద్దు ముద్దుగా మాట్లాడేస్తుంది. బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు చేసినప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన సినీరంగంలోకి అడుగుపెట్టి కెరీర్ ను వేగవంతం చేసుకుంటోంది. తొలుత బాలీవుడ్ సినిమా ద్వారా ఆమె అరంగేట్రం జరిగినప్పటికీ టాలీవుడ్ కు పరిచయమైనప్పట్నుంచి ఇక్కడి సినిమాలకే ఆమె అధిక ప్రాధాన్యమిస్తోంది.

టాలీవుడ్ లో మొదటిసారి నటించిన “సవ్యసాచి ”, చిత్రంతో పాటు రెండో చిత్రం “మిస్టర్ మజ్ను” అనుకున్నంతగా ఆడకపోయినా, ముచ్చటగా నటించిన మూడో చిత్రం `ఇస్మార్ట్ శంకర్” భారీ విజయం సాధించడంతో నిధికి ఒక్కసారిగా ఎనలేని గుర్తింపు లభించింది.ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కానున్న చిత్రంలో నిధి హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు తమిళ సినీ రంగంలో కూడా ఆమెను వెతుక్కుంటూ రెండు అవకాశాలు రావడంతో అక్కడ కూడా హీరోయిన్ గా సందడి చేస్తోంది. తాజాగా అశోక్ గల్లా, నిధి జంటగా నటిస్తున్న చిత్రం చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిధిని చూసేందుకు ప్రేక్షక జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. వారికందరికీ హాయ్ చెబుతూ నిధి షూటింగ్లో నిమగ్నమైంది
Must Read ;- క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్












