గుంటూరు జిల్లాలోని ములకలూరులో గ్రామంలోఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. ఒకరి వర్గంపై మరొకరు రాళ్లు రువ్వుకుంటున్నారు. ఇక్కడి పరిస్థితులు ఉద్రిక్తతలకు దారితీస్తాయని ముందే చెప్పినా.. పోలీసులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితులు చేయిదాటుతున్న నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరు వర్గాల దాడులను నివారించడానికి, గ్రామంలో భారీగా పోలీసులు మోహరించినట్లు సమాచారం.
రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో ఏపీలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్ధి మద్దతు దారులు ఆందోళన చేశారు. కౌంటింగ్ విషయంలో తేడాలు వచ్చాయని ఆరోపిస్తూ.. తూర్పు గోదావరి జిల్లా, గోగవరం మండలం, కృష్ణుని పాళెం పంచాయతీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రీకౌంటింగ్ చేయాలని టీడీపీ మద్దతుదారులు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఓట్ల లెక్కింపులో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఆరోపించారు.
Must Read ;- మరో ఎన్నికలకు నగరా.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వేడి