ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎన్నికల విషయంలో పట్టుదలతో ఉన్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాష్ట్రమంతా పర్యటిస్తూ.. ఎన్నికల ప్రక్రియ, ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. బలవంతం చేసి ఒప్పిస్తే చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్లు, ఉపసంహరణ గడువు ముగియడంతో.. ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, ఎన్ని ఏకగ్రీవాలయ్యాయనే లెక్కలపై దృష్టి నిలిపారు ఎన్నికల సంఘం.
ఏకగ్రీవాలు 16 శాతమే..
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడతలో ఎన్నికలు 3,249 పంచాయతీల్లో జరుగుతున్నాయి. అందులో 517 (15.91 శాతం) ఏకగ్రీవమయ్యాయి. 468 (90.52 శాతం) మంది వైకాపా మద్దతుదారులు, 22 మంది (4.25 శాతం) తెదేపా మద్దతుతో నిలబడినవారు, 27 మంది (5.22 శాతం) మంది స్వతంత్రులు ఆయా పంచాయతీల సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మిగిలిన 2,732 పంచాయితీలకు పోలింగ్ నిర్వహించిన తర్వాతే ఫలితాలు వెల్లడవుతాయి.
Must Read ;- బెదిరింపులు, గొడవలు.. ముగిసిన తొలివిడత పంచాయతీ నామినేషన్లు
జిల్లాల వారిగా ఏకగ్రీవాలు: