యాక్షన్ హీరో గోపీచంద్ – యంగ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం పక్కా కమర్షియల్. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాస్ నిర్మాత. ఈ సినిమాని ఇటీవల ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టైటిల్ పక్కా కమర్షియల్ అని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడంతో పాటు షూటింగ్ డీటైల్స్ కూడా తెలియచేశారు.
మార్చి 5 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాని అక్టోబర్ 1న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. షూటింగ్ స్టార్ట్ చేయకుండానే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం విశేషం. ఇందులో ఎంటర్ టైన్మెంట్ డోస్ బాగా ఎక్కువుగానే ఉంటుంది అంటున్నారు. మారుతి సినిమా అంటేనే ఎంటర్ టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఈసారి డోస్ పెంచుతున్నామని చెప్పారంటే.. ఇందులో ఏ రేంజ్ లో ఎంటర్ టైన్మెంట్ ఉంటుందో ఊహించుకోవచ్చు.
షూటింగ్ డీటైల్స్ ఎనౌన్స్ చేయడంతో పాటు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఫేస్ చూపించకుండా.. సూపర్ సింబల్ తో రిలీజ్ చేశారు. దీనిని బట్టి ఈ ఎంటర్ టైన్మెంట్ స్క్రిప్ట్ పై ఎంత కాన్పిడెంట్ గా ఉన్నారో అర్ధమౌతుంది. ఇప్పటి వరకు గోపీచంద్ కి యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది. మరి.. ఈ సినిమాతో ఎంటర్ టైన్మెంట్ కూడా బాగా చేయగలడు అనేలా గోపీచంద్ కి కొత్త ఇమేజ్ తీసుకువస్తుందేమో అనిపిస్తుంది.
Must Read ;- మారుతి మరోసారి ఏంజిల్ ఆర్నానే ఎంపిక చేశాడా?