వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు CBI కోర్టు చెంప చెల్లుమనిపించింది. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన మెమోను కోర్టు కొట్టిపారేసింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను జగన్ తరపు లాయర్ ఉపసంహరించికున్నారు. కోర్టు తనదైన రీతిలో స్పందించే సరికి భయపడిన జగన్..కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ నెల 21న కోర్టుకు వస్తానని చెప్పారు. ఇందుకు కొంత సమయం తనకు కావాలన్నారు.
అక్టోబర్‌లో విదేశీ పర్యటనకు వెళ్తానని పర్మిషన్ కోరుతూ జగన్ పిటిష్ వేశారు. ఆ పిటిషన్‌కు అనుమతించిన CBI కోర్టు..విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కండీషన్ పెట్టింది. ఐతే జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆ కండీషన్‌ను పట్టించుకోలేదు. తాను కోర్టుకు వస్తే భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని, అది ప్రభుత్వానికి భారంగా మారుతుందన్న సాకుతో..తన బదులు లాయర్ హాజరవుతారని కోర్టుకు చెప్పారు. అది కుదరదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానంటూ మెమో దాఖలు చేశారు.
జగన్ వేసిన మెమోపై విచారణ జరిపిన కోర్టు.. జగన్ అభ్యర్థనను నిర్మొహమాటంగా తిరస్కరించింది. CBI సైతం జగన్‌కు అలాంటి అవకాశం ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేసింది. ఐతే జగన్ ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం కోర్టు మెట్లు ఎక్కుతారా లేదా అనేది ఆసక్తిగా మారింది. గతంలో కింది కోర్టుకు హాజరావ్వాల్సిన పని లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని జగన్ తరపు లాయర్లు వాదిస్తున్నారు. దీంతో ఇప్పుడు జగన్ హైకోర్టుకు వెళ్లేందుకే ఇలా సమయం కోరారని అనుమానాలు బలపడుతున్నాయి.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పూర్తిగా కోర్టుకు హాజరవడం మానేశారు. కేవలం అక్రమాస్తుల కేసుల్లోనే కాదు..కోడికత్తి కేసు, పాస్‌పోర్టు రెన్యూవల్ కోసం కోర్టుకు హాజరు కావాలన్న ఉత్తర్వులు ఉన్నా హాజరు కాలేదు. దీంతో జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది











