ఏపీ, తెలంగాణలో రాజకీయాలు సమీకరణాలు మారుతున్నాయి. గతంలో కాంగ్రెస్ వాదులంతా ఎలా తెలుగుదేశం వైపు ఆకర్షితులయ్యారో.. అదే సీన్.. 40 ఏళ్ళ తరువాత నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రిపీట్ అవుతోంది.
దివంగత ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తొలినాళ్ళల్లో కాంగ్రెస్ వాదులంతా ఆలోచించారు. తెలుగు వాడి స్వేచ్ఛా, హక్కులను కాపాడుకోవాడానికి.. ఆత్మగౌరవ నినాదంతో పుట్టుకొచ్చిన తెలుగు దేశం వైపు కాంగ్రెస్ అసంతృప్తి నేతలంతా క్యూ కట్టారు. అప్పటి వరకు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పాలనలో విసిగి వేజారిన ప్రజలంతా ఎన్టీఆర్ పార్టీ వైపు టర్న్ అయ్యారు. 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని అన్న ఎన్టీఆర్ స్ధాపిస్తే.. 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి ఏపీలో మొత్తం 296 అసెంబ్లీ స్ధానాలకు టీడీపీ 289 స్థానాల్లో పోటీ చేయగా.. 201 స్థానాల్లో తెలుగుదేశం విజయకేతనం ఎగరవేసింది.
పార్టీ పెట్టిన 8 నెలల్లోనే తెలుగు దేశం అధికారంలోకి వచ్చింది. ఈ విజయకేతనంలో ప్రముఖ పాత్ర పోషించింది తెలంగాణ గడ్డ బిడ్డలే. తెలుగుదేశం గెలుపొందిన 201 స్థానాలలో దాదాపు 65 శాతం పైగా అసెంబ్లీ స్ధానాలు తెలంగాణ నుంచి వచ్చినవే. తెలుగు దేశం పుట్టింది తెలంగాణ గడ్డపైనే.., పార్టీని భుజస్కందాలపై వేసుకుని మోసింది తెలంగాణ ప్రజలే. అంతటి ఘన కీర్తిని ఉన్న తెలుగు దేశాన్ని ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టి కేసీఆర్ క్యాప్చర్ చేశారు. ఇదిలా ఉంటే దశాబ్ధ కాలంగా కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగివేసారి పోయారు. అలానే ఏపీలో కూడా రాజకీయ పరిణామ క్రమం పూర్తిగా మారుతున్నది చూస్తూనే ఉన్నాం. జగన్ ఒంటెద్దుపోకడలు, నియంతృత్వం ద్రోరణిలతో అన్నీ వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోయామని ప్రజలు బలంగా భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలంతా.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయేనని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
స్కిల్ కేసు లో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మొన్న రాజమండ్రి నుంచి ఉండవల్లి వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు, సామాన్య ప్రజలు సైతం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఆయనకు స్వాగత నీరాజనాలు పలికారు. దాదాపు రాజమండ్రి నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకునే సమయం 16 గంటలు పైగా పట్టింది. దీనినిబట్టే చూడచ్చు.. చంద్రబాబుకు పార్టీ అభిమానులే కాదు.. కామన్ ప్రజలు కూడా వారి అభిమానాన్ని ఎంతలా చాటుకున్నారన్నది దీనినిబట్టే అర్థమవుతోంది.
అలాగే ఉండవల్లి నుంచి చంద్రబాబు బుధవారం హైదరాబాద్ కు వైద్య చికిత్స నిమిత్తం వచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన చంద్రబాబుకు జూబ్లీహిల్స్ వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. దాదాపు 3 గంటలకు పైగా హైదరాబాద్ లో చంద్రబాబు రోడ్డుషో నడిచింది. రోడ్లన్నీ పూలతో నింపారు. పెద్దఎత్తున బాణాసంచ కాల్చి.. స్వీట్లు పంపిణి చేసుకున్నారు. గత రెండు దశాబ్ధాలుగా తెలంగాణలో పార్టీ అధికారంలో లేదు.., నాయకులంతా కాడిని వదిలి.. పక్క పార్టీలకు వలస వెళ్లారు. కానీ.., నిన్న చంద్రబాబు హైదరాబాద్ రాగానే.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కేడర్ అంతా దాదాపు కీలోమీటర్ల వరకు బారులు తీరి చంద్రబాబుకు జేజేలు పలికారు. కార్యకర్తల నినాదాలతో భాగ్య నగరం ప్రతిధ్వనించింది. దీంతో తెలంగాణ తిష్ఠవేసిన అన్నీ రాజకీయ పార్టీలో ఆలోచనలో పడ్డాయి. బలంగా ఉన్న అధికార బీఆర్ఎస్ సైతం చంద్రబాబు మాస్ మ్యానియా చూసి.. మైండ్ బ్లాక్ అయ్యి.. కొంత డిఫెన్స్ లో పడినట్లు విశ్లేషణలు ఊపందుకున్నాయి. దీనిని బట్టి ఏపితో పాటు తెలంగాణలో కూడా ప్రజల మైండ్ సెట్ పూర్తిగా మారుతోందన్నది ఫుల్ క్లారిటీ వస్తోంది. గతం మాదిరిగానే తెలుగుదేశం వైపు ప్రజలు తిరిగి డైవర్ట్ అవుతున్నారని తేటతెల్లమవుతోంది.