‘ఉయ్యాల జంపాల’తో టాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయింది అందాల అవికా గోర్. బాలికా వధు టీవీ సిరీయల్ తో వచ్చిన క్రేజ్ ను మొదటి సినిమా సస్టెయిన్ చేసింది. అయితే ఆ తర్వాత అవికా నటించిన పలు చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందడంలో విఫలమయ్యాయి. ఆ తర్వాత అమ్మడు బరువు తగ్గడం కోసం, చదువుకోసం సినిమాలకు కొంత గ్యాపిచ్చింది. మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నానంటూ.. ఇటీవలే ప్రకటించిన ఆమెకి అంతగా ఆఫర్స్ రావడం లేదు. దాంతో అవికా గోర్ .. రీల్ లైఫ్ కన్నా రియల్ లైఫే బెటరని భావిస్తోందేమో .. సోషల్ మీడియాలో ఎంచక్కా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసేసింది.
ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ ఫోటో ను షేర్ చేసింది అవికాగోర్. అతడి పేరు మిలింద్ చద్వానీ. అతడితో ప్రేమలో ఉన్నట్టు చెప్పేసింది ఆమె. నన్ను అర్ధం చేసుకొనే వ్యక్తి నాకు దొరికాడు. అతడు నా పట్ల కేర్ తీసుకుంటూ.. నాలో స్ఫూర్తి నింపుతాడని నాకు నమ్మకముంది. నా లైఫ్ కు ఎట్టకేలకు ప్రేమ దొరికింది. అంటూ అతడితో గుండెల నిండా ప్రేమను నింపుకొని..పోస్ట్ చేసింది. టాలీవుడ్ లో ఆఫర్స్ రాని తరుణంలో తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన అవికాగోర్ .. త్వరలోనే అతడిచేత మూడు ముళ్ళు వేయించుకోబోతోందని అర్ధమవుతోంది. ప్రస్తుతం అవికా బాయ్ ఫ్రెండ్ గురించి తెగ సెర్చ్ చేసేస్తున్నారు నెటిజెన్స్.