పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత పవన్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తో ఒక సినిమాను చేయబోతున్నారు. అందుకు అనుగుణంగా ఈ మధ్యనే తన లుక్ ను కూడా మార్చుకున్నారు పవన్. త్వరలోనే క్రిష్ తీయబోయే సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొనబోతున్నారని సమాచారం.
ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటుగా కనపడనున్నాడని టాక్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం గత రెండు నెలల నుండి ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించిన అప్డేట్ ఒకటి రాబోతుందని అభిమానులు భావిస్తున్నారు. అందుకు కారణం డైరెక్టర్ క్రిష్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ‘ఈ శనివారం’ అని పోస్ట్ చేశాడు.
అంతకుమించి మరేది పోస్ట్ చేయలేదు క్రిష్. అయితే క్రిష్ ఈ శనివారం నాడు పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన ఏదొక అప్డేట్ ఇస్తాడని అభిమానులు భావిస్తున్నారు. అందుకనే క్రిష్ ఈ విధంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడని అభిప్రాయపడుతున్నారు. క్రిష్ ఈ శనివారం పవన్ సినిమాపై ఒక సాలిడ్ అప్డేట్ తో వస్తున్నాడని అభిమానులైతే ఫిక్స్ అయిపోయారు. మరి క్రిష్ పోస్ట్ చేసింది పవన్ సినిమా కోసమా మరేదైనా విషయం కోసమా అని తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.











