వినుకొండ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తన నివాసంలో నిరసనకు దిగారు.వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని,లేదంటే కోటప్పకొండలో సత్యప్రమాణం చేయడానికి రావాలని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.దీనిపై నిన్న సత్యప్రమాణానికి బయలు దేరిన జీవీ ఆంజనేయులును హౌస్ అరెస్టు చేశారు.దీనికి నిరసనగా జీవీ ఆంజనేయులు తన నివాసంలో నిరసనకు దిగారు.జీవీ ఆంజనేయులు శివశక్తి ఫౌండేషన్ ద్వారా విదేశాల నుంచి విరాళాలు స్వీకరించి,దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.దీనిపై మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు.
నిరూపించండి, లేదంటే సత్యప్రమాణానికి రండి
తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు.ప్రస్తుత ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పేదల ఇళ్ల స్థలాల్లో ఎన్ని కోట్లు కొట్టేశారో తాను నిరూపించడానికి సిద్దమని జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు.తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని,లేదంటే సత్యప్రమాణానికి కోటప్పకొండ రావాలని ఆయన పట్టుపడుతున్నారు.ఇద్దరి నేతల మధ్య వివాదం గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Must Read ;- ఆయనొస్తే తమ ప్రాధాన్యం తగ్గుతుందనా.. తెలంగాణ బీజేపీలో ఈటల ప్రకంపనలు











