గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును హౌస్ అరెస్ట్ చేశారు.వినుకొండలో తన నివాసానికి వచ్చిన పోలీసులు అర్థరాత్రి నోటీసులు జారీ చేశారు.జీవీ ఆంజనేయులును హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు.వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని, దమ్ముంటే కోటప్పకొండలో సత్యప్రమాణానికి ఇవాళ రావాలని జీవీ ఆంజనేయులు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనికి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కూడా సిద్దమయ్యారు.దీంతో ఇరు వర్గాలు కోటప్పకొండకు వెళ్లే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తుగా జీవీ ఆంజనేయులును హౌస్ అరెస్టు చేశారు.
అవినీతి అనకొండ బ్రహ్మనాయుడు
వినుకొండ ఎమ్మెల్యే గత రెండేళ్ల నుంచి భారీ అవినీతికి పాల్పడ్డాడని పేదల ఇళ్ల స్థలాల కొనుగోలు,ఇసుక,మట్టి దోపిడీపై టీడీపీ నేత జీవీ ఆంజనేయులు తీవ్ర విమర్శలు చేశారు.ఎమ్మెల్యే అవినీతిని నిరూపించడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును మించిన అవినీతిపరుడు లేడని బ్రహ్మనాయుడు విమర్శలు చేయడంతో ఇరువర్గాలు సత్యప్రమాణాలకు సవాల్ విసురుకున్నారు.ఇవాళ కోటప్పకొండలో ఇద్దరూ సత్యప్రమాణాలకు వెళ్లాల్సి ఉండగా,అర్థరాత్రి నుంచి జీవీ ఆంజనేయులును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా హౌస్ అరెస్టు చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు.
Must Read ;- అక్రమ అరెస్టులతో అరాచకం.. దూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన లోకేష్











