ఏపీ కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అంతేస్థాయిలో పెరుగుతున్నాయి. ఆక్సిజన్, బెడ్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కష్టకాలంలో టీడీపీ తనవంతుగా సాయం చేస్తోంది. కరోనా బాధితుల కోసం హెల్ప్ లైన్ తీసుకొచ్చింది. టీడీపీ మొదలుపెట్టిన హెల్ప్ లైన్ కు అనతికాలంలోనే మంచి రెస్సాన్ వస్తోంది. కుప్పం కు చెందిన శ్రీదేవి గవర్నమెంట్ టీచర్. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయని తేలడంతో, ఆమె భర్త కూడా టెస్ట్ చేయించుకున్నారు. ఇద్దరికీ కొవిడ్ పాజిటివ్ రావడంతో టీడీపీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు. దీంతో ఆన్ లైన్ లో ఏ యే మందులు వాడాలి.. ఎలా వాడాలి.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి సూచనలు పాటిస్తూ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. డాక్టర్లు సూచించిన జాగ్రత్తలతో ఇద్దరు కోలుకున్నారు.
కుప్పంలోని గుడిపల్లికి చెందిన కొంతమంది యువకులు సైతం హెల్ప్ లైన్ ద్వారా కరోనా సేవలను పొందారు. హోం ఐసోలేషన్ సాధ్యంకానివాళ్లు ట్రస్టులోనే ఉండి కోలుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు.
Must Read ;- NTR ట్రస్టు ద్వారా టెక్కలి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్