భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. హరియాణా పోలీసులు ఆదివారం అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యువీ గతేడాది ఓ సామాజిక వర్గం పేరుతో చేసిన వ్యాఖ్యలకు గానూ.. హిసార్‌లోని హాన్సీ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం యువరాజ్‌పై కేసు ఫైల్ అయ్యింది. ఓ అడ్వకేట్ ఫిర్యాదు చేయడంతో… అతనిపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఓ సామాజికవర్గంపై వ్యాఖ్యలు..
యువరాజ్‌సింగ్ గతేడాది జూన్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో చాట్ చేశారు. ఈ సందర్భంగా యువీ తన సహచరుడైన యజువేంద్ర చాహల్‌ను ఉద్దేశిస్తూ ఓ సామాజిక వర్గం పేరుతో వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో యువరాజ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై యూవీ అప్పుడే.. ట్విటర్‌లో స్పందించారు.
క్షమించాలంటూ.. యూవీ ట్వీట్
తాను ఎవర్నీ కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ… ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. అప్పట్లో చేసిన ఆ వ్యాఖ్యలు యూవీకి కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టాయి. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 295, 505తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని 3(1)(ఆర్), 3(1)(ఎస్) కింద యువరాజ్‌పై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు.
Must Read ;- రోహిత్ నైన్టీ ఫీవర్.. రితికా హార్ట్ లబ్..డబ్!











